Bollywood Heroine : రొమ్ము క్యాన్సర్‌ తో పోరాడుతున్న బ్యూటీ… 3rd స్టేజ్ అంటూ పోస్ట్..!

Bollywood Heroine.. చాలా సందర్భాలలో సెలబ్రిటీలు సైతం క్యాన్సర్ బారిన పడ్డ విషయాన్ని తెలియజేస్తూ ఉంటారు. అయితే ఇలా ప్రకటించిన చాలా మంది హీరోయిన్స్ ఈ వ్యాధితో పోరాడి ప్రస్తుతం ఆరోగ్యంగా తిరిగి సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసింది. అలాంటి వారిలో మమతా మోహన్దాస్, సోనాలి బింద్రే, షీలా , మనీషా కొయిరాలా ఇలా తదితర హీరోయిన్స్ సైతం ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఈ జాబితాలోకి మరో బాలీవుడ్ నటి వచ్చి చేరింది.. ఈ విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ నటి హినాఖాన్ క్యాన్సర్ బారిన పడ్డట్టుగా ఆమె స్వయంగా తెలియజేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

హినా ఖాన్ తొలి పరిచయం..

హినా ఖాన్ జమ్మూ కాశ్మీర్లో పుట్టి పెరిగింది.. 2009వ సంవత్సరంలో ఈమె నటిగా మొదటిసారి కెరీయర్ ను ప్రారంభించింది. మొదట ఏ రిస్తా క్యా ఖేల్తే హై సినిమాతో మొదటిసారి తన కెరియర్ ను సైతం ప్రారంభించింది హినాఖాన్.. ఇక తర్వాత ఎన్నో సీరియల్స్ లో నటించినప్పటికీ.. బిగ్ బాస్ సీజన్ 11 లో పాల్గొన్న తర్వాత ఈమె క్రేజ్ అమాంతం పెరిగింది.. ఆ తర్వాత నాగిన్ తదితర సీరియల్స్ లో కూడా పలు కీలకమైన పాత్రలలో నటించి ప్రేక్షకులను బాగానే మెప్పించింది. అలాగే ఈమె క్రేజ్ తో మరికొన్ని సీరియల్స్ లో కూడా అతిధి పాత్రలో నటించింది ఈ ముద్దుగుమ్మ.

క్యాన్సర్ బారిన పడిన హినాఖాన్..

Bollywood Heroine: Beauty fighting with breast cancer... 3rd stage post..!
Bollywood Heroine: Beauty fighting with breast cancer… 3rd stage post..!

హినా ఖాన్ పలు చిత్రాలలోనే కాకుండా వెబ్ సిరీస్లలో కూడా నటించింది. సీరియల్ లో నటిస్తున్న సమయంలోనే ప్రొడ్యూసర్ రాఖీ జేష్ వాలా ని ప్రేమించి మరీ వివాహం చేసుకుంది. 2014లో ఈ జంట ఒకటయ్యింది.. హినా ఖాన్ ఒక షోలో పాల్గొన్నప్పుడు తనకి ఆస్తమా ఉన్నట్లుగా బయట పెట్టడం జరిగింది. అయితే ఆ తర్వాత ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోని ఆమె.. ఇప్పుడు తాజాగా తాను మూడవ దశ రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు తెలియజేసింది. ఈ విషయం తెలిసి అటు ఇండస్ట్రీ.. ఇటు ఫ్యాన్స్ సైతం ఆందోళన చెందుతున్నారు

- Advertisement -

సోషల్ మీడియా ద్వారా అధికారిక ప్రకటన..

తాజాగా సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేసిన హినా ఖాన్ తనకు బాగానే ఉన్నదని.. అందుకు తగిన ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని.. దేవుడి దయ అభిమానుల ఆశీస్సులతో త్వరలోనే పూర్తిగా కోలుకొని.. ఆరోగ్యంగా తిరిగి వస్తానంటూ కూడా తెలియజేసింది.. దీంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నప్పటికీ.. త్వరగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు.. వీరే కాకుండా పలువురు సెలబ్రిటీలు కూడా ఈమెకు ధైర్యాన్ని నింపే విధంగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి పోస్ట్ షేర్ చేయగా ఆ పోస్ట్ వైరల్ గా మారుతున్నది. ఏది ఏమైనా ఈమె బ్రెస్ట్ క్యాన్సర్ మూడవ దశకు చేరుకున్నానని చెప్పి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏది ఏమైనా ఈమె త్వరగా ఆరోగ్యంగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు