Bollywood Heroine: ప్రభాస్ పై మోజు పడుతున్న బాలీవుడ్ బ్యూటీ.. టాటూ కూడా..!

Bollywood Heroine: రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి సినిమా ముందు వరకు ఈయన క్రేజ్ ఒక ఎత్తైతే .. బాహుబలి సినిమా తర్వాత ఈయన క్రేజ్ మరోలా మారిపోయింది.. ఇప్పుడు ఈయన ఏకంగా సూపర్ స్టార్.. నిన్నటి వరకు పాన్ ఇండియా హీరోగా చలామణి అయిన ఈయన.. నేడు కల్కి సినిమాతో గ్లోబల్ స్థాయి సొంతం చేసుకున్నారని చెప్పవచ్చు. ఇక ఎప్పుడైతే బాహుబలి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారో అప్పటినుంచి పాన్ ఇండియా హీరోగా పేరు దక్కించుకున్నారు. ఆ తర్వాత తీసిన సాహో, రాధే శ్యామ్, ఆది పురుష్ ఇలా ప్రతి ఒక్కటి కూడా బాలీవుడ్ లో ఈయన స్థాయిని పెంచేశాయి ..ఇప్పుడు కల్కి సినిమా దాదాపు హిందీ సినిమాలను మించి వసూలు చేస్తోంది..

Bollywood Heroine: Bollywood beauty who is obsessed with Prabhas.. Tattoo too..!
Bollywood Heroine: Bollywood beauty who is obsessed with Prabhas.. Tattoo too..!

ప్రభాస్ పై స్టార్ హీరోయిన్ ల ఆసక్తి..

అంతేకాదు హాలీవుడ్ చిత్రాల రేంజ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించే ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.. ఇంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ప్రభాస్ అంటే ఎంతో మంది బాలీవుడ్ హీరోయిన్స్ కి అభిమానం.. ఇప్పటికే ఆ విషయాన్ని చాలామంది హీరోయిన్స్ వెల్లడించారు కూడా.. ఇక ప్రభాస్ చేస్తున్న ప్రతి సినిమాలో కూడా బాలీవుడ్ స్టార్స్ ను మనం చూస్తూనే ఉన్నాం. సాహో సినిమాలో శ్రద్ధా కపూర్ నటించగా.. ఆ సమయంలో ప్రభాస్ అంటే ఆసక్తి ఉందని ఆమె తెలిపింది..అయితే ఆ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే పుకార్లు షికార్లు చేశాయి. ఇక ఆది పురుష్ సినిమా సమయంలో అలాంటి పుకార్లు పెద్ద ఎత్తున రావడంతో శ్రద్ధా కపూర్ నుంచి కృతి శెట్టి వైపు వెళ్లిపోయారు అభిమానులు.

ప్రభాస్ పై మోజు.. PD అర్థం అదేనా..

ఇప్పుడు దిశా పటానీ పై చర్చ జరుగుతోంది.. ఇటీవల దిశాపటానీ ” PD “అనే అక్షరాలను టాటూగా వేయించుకుంది.. ఇది చూసిన చాలా మంది ఆ అక్షరాలకు అర్థం ప్రభాస్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఇటీవల కల్కి సినిమాలో దిశాపటాని, ప్రభాస్ కలసి పనిచేశారు.. ఈమె కనిపించింది కొద్దిసేపే అయినా బాగా ఆకట్టుకుంది.. ప్రభాస్ మరియు దిశా జోడి కూడా బాగుంటుందని.. ముందు ముందు వీరిద్దరి కాంబినేషన్లో మరిన్ని సినిమాలు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.. ఇలాంటి సమయంలోనే ఊహించని విధంగా PD అని దిశా చేతిపై కనిపించడంతో అందరూ “ప్రభాస్ దిశా ” అంటూ ఫిక్స్ అయిపోతున్నారు. అయితే ఈ రెండక్షరాల అర్థం ఏమిటో తెలియక మరికొంతమంది కథలుగా అల్లేస్తున్నారు.. ఇంకొంతమంది దిశా పటానికి ప్రభాస్ అంటే చాలా ఇష్టమని.. ఆయనంటే చచ్చిపోతుందని కూడా కామెంట్లు చేస్తున్నారు.. మరి ఈ రెండు అక్షరాల అర్థం ఏమిటో తెలియదు కానీ ప్రస్తుతం ఈ రెండు అక్షరాలు మాత్రం సోషల్ మీడియాలో సరికొత్త పుకారు సృష్టించేలా చేస్తున్నాయి. మరి ఏది ఏమైనా ఈ రెండక్షరాల అర్థం ఏమిటో దిశాపటాని వెల్లడిస్తే తప్ప ఈ రూమర్లకు బ్రేక్ పడదు అని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు