Bollywood heroine: @69లో తల్లి కావాలనుకుంటున్న హీరోయిన్..!

Bollywood Heroine: సాధారణంగా వివాహమైన తర్వాత చాలామంది మహిళలు అమ్మ అని పిలిపించుకోవడానికి ఎంతో తాపత్రయ పడుతూ ఉంటారు. అయితే మరికొంతమంది యవ్వనంలో ఉన్నప్పుడు పిల్లలు వద్దనుకొని, వయసు ముదిరిన తర్వాత పిల్లలు కావాలని కోరుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. అయితే మరికొంతమంది పిల్లలు కావాలని తాపత్రయపడినా, వారికి మాత్రం తల్లి అయ్యే భాగ్యం ఉండదు. అలాంటి వారిలో బాలీవుడ్ ఎవర్ గ్రీన్ బ్యూటీ రేఖ కూడా ఒకరు.. తాజాగా 69 సంవత్సరాల వయసులో తల్లి కావాలని ఉంది అంటూ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది..

Bollywood heroine: Heroine who wants to be a mother at @69..!
Bollywood heroine: Heroine who wants to be a mother at @69..!

బాలీవుడ్ ఎవర్ గ్రీన్ బ్యూటీ..

ఇకపోతే ఒకప్పుడు ఎన్నో సినిమాలలో పవర్ఫుల్ పాత్రలు పోషించి అభిమానులను అలరించిన ఈ ముద్దుగుమ్మ, నేడు సినిమాలకు దూరమైనా వ్యక్తిగత కారణాలవల్ల ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇకపోతే ఈమె వ్యక్తిగత జీవితంలో ఎక్కువగా చాలా మంది హీరోలతో ఎఫైర్ నడిపిందని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. కానీ సెలబ్రిటీలు ఎవరితో కూడా ఈమె పెళ్ళి వరకు వెళ్లలేదు. ఇకపోతే బి-టౌన్ ఇండస్ట్రీలో ఎప్పటికీ మర్చిపోలేని లవ్, బ్రేకప్ స్టోరీ అంటే రేఖ – అమితాబ్ బచ్చన్ అనే చెప్పాలి. వీరిద్దరూ అప్పట్లో పీకల్లోతు వరకు ప్రేమించుకొని, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారట. కానీ జయా బచ్చన్ కారణంగా వీరిద్దరూ విడిపోయారు.

69 యేళ్ళ వయసులో తల్లి కావాలనే కోరిక..

ఇదిలా తాజాగా 1984లో జరిగిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు మళ్లీ వైరల్ గా మారుతోంది. అందులో ఈమె పెళ్లి , కుటుంబం, పిల్లలు గురించి మాట్లాడింది. నాకు చాలామంది పిల్లలు కావాలనుకున్నాను. పెళ్లి కావాలనే నా కోరిక తీరుతుందని కూడా నమ్మాను.. కానీ పెళ్లికి ముందు తల్లిని అవ్వాలనుకోలేదు. 30 ఏళ్లలోపు పిల్లలు పుట్టాలని , మా అమ్మ ఎప్పుడు చెబుతూ ఉండేది. అమ్మ చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది.. నా పిల్లలు నాతో పాటు ఎదగాలని నేను భావించాను.. నాకు, పిల్లలకు మధ్య ఎలాంటి విభేదాలు ఉండకూడదు అని కూడా తెలుసుకోవాలనుకున్నాను.. ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా వందేళ్లు ముందుకే ఆలోచిస్తాను. సాధ్యమైనంత వరకు నేను ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతాను .. కానీ ఇంట్లో ఒంటరితనాన్ని తగ్గించడానికి నాకు కూడా నా బిడ్డ కావాలి , నా పిల్లలతో నా ఇల్లు నిండుగా ఉండాలి అని భావించాను.

- Advertisement -

అమ్మలాగా కాకూడదనుకున్నా..

మా అమ్మ లాగా నేను కూడా పెళ్లికి ముందు తల్లిని అవ్వాలనుకోలేదు .ఎందుకంటే మా అమ్మను నేను చూసాను. నాన్న మమ్మల్ని పట్టించుకోలేదు. మా అమ్మ ఒంటరిగా మమ్మల్ని పెంచింది. అందుకే పిల్లల్ని ఒంటరిగా చూసుకోవడం ఎంత కష్టమో నాకు తెలుసు. నాకు బిడ్డ ఎప్పుడు పుడుతుందో నాకు తెలియదు. బహుశా అది ఇంకెప్పటికీ జరగదు అంటూ చాలా సంవత్సరాల క్రితం చెప్పుకొచ్చింది రేఖ. అయితే తాను 69 సంవత్సరాలు వయసులో కూడా అదే కోరికతోనే బ్రతుకుతోంది. కానీ ఆ కోరిక మాత్రం నెరవేర లేకపోవడం నిజంగా బాధాకరమనే చెప్పాలి.

రేఖ పెళ్లి జీవితం..

ఇక రేఖ ప్రేమ, పెళ్లి విషయానికి వస్తే ఒకప్పుడు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ను ఎక్కువగా ప్రేమించింది. కానీ వీరు ప్రేమ, పెళ్లి వరకు వెళ్లలేదు. అమితాబ్ జయా ను వివాహం చేసుకుంటే, ఈమె ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అగర్వాల్ వివాహం చేసుకుంది. అయితే ఈ పెళ్లి కూడా ఎక్కువ కాలం నిలవలేదు. మానసిక సమస్యలతో ముఖేష్ అగర్వాల్ వివాహం జరిగిన 6 నెలలకే ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సమయంలో రేఖ ఎఎన్నో విమర్శలను ఎదుర్కొంది.. ఇక నాటి నుండి నేటి వరకు పెళ్లి జోలికి వెళ్లకుండా ఒంటరిగా జీవిస్తోంది రేఖ . కానీ తన కోరికను మాత్రం నెరవేర్చుకోలేకపోవడం ఆమె మదిని కలిచి వేస్తోందని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు