Bollywood: బాలీవుడ్ హీరోయిన్ మూవీ మరోసారి వాయిదా..!

Bollywood: ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ మనందరికీ సుపరిచితమే. ఈమె చివరిగా తేజస్ లో కనిపించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేదు. ఇక ఈమె నుంచి రాబోయే ప్రాజెక్ట్ ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆమె రాజకీయ నాయకురాలిగా మారిన తరువాత రాబోయే లోక్సభ ఎన్నికల కోసం ప్రచారం చేస్తున్నారు.

ఈలోగా.. ఎమర్జెన్సీ విడుదలకు సంబంధించిన చిత్ర నిర్మాణ బృందం ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. అధికారికంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. కొత్తది ప్రకటన పెండింగ్ లో ఉంది. ఎన్నికల కారణంగా కంగనా కీలక షెడ్యూల్ లో పాల్గొనలేరు. మొదట నవంబర్ 24, 2023న విడుదల కావాల్సిన మూవీ ఇది. అయితే విడుదల జూన్ 14, 2024 కి షెడ్యూల్ చేశారు.

Bollywood heroine movie postponed once again
Bollywood heroine movie postponed once again

కానీ ఇప్పుడు అది కూడా మరోసారి వాయిదా పడింది. ఇలా ఈ మూవీ ని వాయిదా వేసుకుంటూ వెళ్తున్నారు చిత్ర బృందం. దీనిపై ఇప్పటికే అఫీషియల్ క్లారిటీ కూడా ఇచ్చేశారు. కంగనా రాజకీయాలలో ఫుల్ బిజీగా ఉండడం వల్లే ఇటువంటి పరిస్థితి ఏర్పడినట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఏదేమైనా ఇది సినిమాకి మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు