Bollywood Heroine.. బాలీవుడ్ స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా సోదరి పరిణీతి చోప్రా గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. గత ఏడాదే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. బాలీవుడ్ లో కూడా తన అందచందాలతో సత్తా చాటింది.. ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్ లో కూడా తన అందం అభినయంతో అందరినీ ఆకట్టుకున్న ఈమె తాజాగా ఒక స్టార్ హీరో గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆ స్టార్ హీరో ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ రన్వీర్ సింగ్..
రణవీర్ సింగ్ గుట్టు రట్టు చేసిన పరిణీతి చోప్రా..
సినీ ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ అయితే సంపాదించుకున్నారో అంతే బోల్డ్ గా ఉంటాడు కూడా.. అతడి ఘనకార్యాల చిట్టాని తాజాగా బాలీవుడ్ బ్యూటీ పరిణితి చోప్రా విప్పింది.. రణవీర్ సింగ్, పరిణీతి చోప్రా ఇద్దరు మంచి స్నేహితుల అన్న విషయం అందరికీ తెలిసిందే.. వీళ్ళిద్దరూ లేడీస్ వర్సెస్ రిక్కీ బహెల్, బ్యాండ్ బాజా భారత్ వంటి చిత్రాలలో కలిసి నటించారు.. మొదట లేడీస్ వర్సెస్ రిక్కీ బహెల్ అనే చిత్రం ద్వారానే పరిణీతి చోప్రా ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. దీనితో ఆమెకి రన్వీర్ తో మంచి బాండింగ్ ఏర్పడిందని చెప్పవచ్చు.. ముఖ్యంగా రన్వీర్ చేసే చేష్టలు షూటింగ్ లొకేషన్స్ లో భరించడం కష్టం అంటూ ఆమె ఫన్నీగా చెప్పుకొచ్చింది..
బట్టలు వేసుకోడు..
బట్టలు సరిగా వేసుకోడు..ఒక్కోసారి ఒంటిమీద బట్టలు లేకుండానే వచ్చి పక్కనే కూర్చుంటాడు.. ఒకసారి ప్యాంటు లేకుండా వచ్చి పక్కన కూర్చుంటాడు.. కనీసం ప్యాంటు అయినా వేసుకోవచ్చు కదా అని చెబితే అప్పుడు క్యారవాన్ లోకి వెళ్లి వేసుకొని వస్తాడు.. నిజం చెప్పాలంటే అతడి క్యారవాన్ కి వెళ్లాలంటేనే భయం వేస్తుంది ..అక్కడ ఏ స్థితిలో ఉన్నాడో అని.. కంగారుపడుతూ వెళ్లాలి.. అందుకే లోపలికి రావచ్చా అని అడిగి వెళ్తాను.. కొన్ని కొన్ని సార్లు అడిగి వెళ్లినా సరే అక్కడ బట్టలు లేకుండా దర్శనం ఇస్తాడు.. అసలు ఏంటి నువ్వు.. బట్టలు లేకుండా ఎందుకు తిరుగుతావు.. అని అడిగితే.. నన్ను అలా చూడడం వల్ల ఎవరికి నష్టం లేదు కదా అంటూ నిర్మొహమాటంగా సిగ్గు లేకుండా చెప్పేస్తూ ఉంటాడు.. ఇతడిని భరించాలంటే చాలా సహనం ఉండాలి అంటూ చెప్పుకొచ్చింది.
నెటిజన్స్ ట్రోల్స్ వైరల్..
అలాగే తనకి ఎదురైన ఒక సంఘటన గురించి కూడా ఆమె చెప్పుకుంటూ.. ఒకసారి రొమాంటిక్ సీన్ లో ప్యాంటు లేకుండా వచ్చాడు.. నేను చూసి ఆశ్చర్యపోయాను.. ఇలా ఉంటే ఇబ్బంది.. స్క్రిప్ట్ లో ఉన్నట్లు మాత్రమే చేద్దామని చెప్పాను.. అప్పుడు ప్యాంట్ వేసుకొని వచ్చాడు అంటూ తెలిపింది పరిణీతి చోప్రా. మొత్తానికి అయితే రన్వీర్ సింగ్ సెట్ లో ఎలా ఉంటాడు అనే విషయంపై ఆమె క్లారిటీ వచ్చింది. ఈ విషయం తెలిసి నేటిజన్స్ ఛీ.. రణవీర్ ఏంటి ఇలా పబ్లిక్ గా బట్టల్లేకుండా తిరుగుతాడా అంటూ కామెంట్లు చేస్తున్నారు.