Bollywood: కుళ్లిపోయిన స్థితిలో కాజోల్ తో సహనటి మృతదేహం… రీజన్ ఇదేనట

Bollywood: హిందీ చిత్ర పరిశ్రమ నుంచి ఓ షాకింగ్ వార్త తాజాగా బయటకు వచ్చింది. ఓ ప్రముఖ నటి శవం కుళ్లిపోయిన దశలో కన్పించడం అందరినీ తేరుకోలేని షాక్ కు గురి చేసింది.

కుళ్లిపోయిన స్థితిలో నటి శవం

ది ట్రయల్ అనే వెబ్ సిరీస్‌లో స్టార్ హీరోయిన్ కాజోల్‌తో కలిసి పని చేసిన నటి నూర్ మలాబికా దాస్ కన్నుమూశారు. ఆమె మరణవార్త విన్న సినీ ప్రముఖులు అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. మాలాబికా దాస్ ఆత్మహత్య చేసుకుందనే కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లోఖండ్‌వాలాలోని ఓ ఫ్లాట్‌లో పోలీసులు ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

అసలేం జరిగిందంటే?

నూర్ మాలాబికా దాస్ తన బెడ్ రూమ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. పక్క ఫ్లాట్ నుంచి దుర్వాసన వస్తోందని పోలీసులకు తెలిపారు. అప్పుడు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓషివారా పోలీసులు ఇప్పుడు ఈ కేసును విచారిస్తున్నారు.

- Advertisement -

అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే ఆమె మృతదేహం కుళ్ళిన స్థితిలో కన్పించింది. తలుపులు పగులగొట్టి ఫ్లాట్‌లోకి ప్రవేశించిన పోలీసులు ఫ్యాన్‌కు వేలాడుతూ ఉన్న నూర్ మాలాబికా దాస్ మృతదేహాన్ని గుర్తించారు. నటి కుటుంబ సభ్యులు ఎవరూ ముంబైలో నివసించడం లేదని కూడా వార్తలు వస్తున్నాయి. నూర్ మలాబికా దాస్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Noor Malabika Wiki, Bio, Net Worth, Instagram and All Web Series List 2024

ఆత్మహత్యకు కారణం ?

ఓషివారా పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం నటి కొన్ని రోజులుగా డిప్రెషన్‌తో బాధపడుతోందని తెలుస్తోంది. అంతే కాదు నూర్ మలాబికా దాస్ యాంటీ డిప్రెసెంట్ మందులు వేసుకుంటుందని తెలిపారు. మనోవేదనకు గురైన ఈ నటి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ప్రస్తుతం పోలీసులు ఇంకా విచారణ జరుపుతున్నారు. మిగిలిన వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.

పట్టించుకోని కుటుంబ సభ్యులు

మీడియా కథనాల ప్రకారం పోలీసులు నూర్ మలాబికా దాస్ కుటుంబ సభ్యులను సంప్రదించడానికి ప్రయత్నించారు. అయితే ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకోవడానికి కుటుంబ సభ్యులు ఎవరూ రాలేదు. దీంతో చేసేదేం లేక చివరకు ఓ ఎన్జీవో సహకారంతో పోలీసులు నటి మృతదేహాన్ని దహనం చేసినట్టు తెలుస్తోంది. ఈ వార్త బయటకు రావడంతో నూర్ కు ఆమె కుటుంబంతో విభేదాలు ఉన్నాయని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఏదేమైనా చనిపోయాక కూడా కుటుంబ సభ్యులు కడసారి చూపుకు కూడా ఇష్టపడకపోవడం బాధాకరం అంటున్నారు ఆమె అభిమానులు.

నూర్ మలాబికా దాస్ ఎవరు?

నూర్ మలాబికా దాస్ స్వస్థలం అస్సాం. కొన్నేళ్ల క్రితం నూర్ మలాబిక తన యాక్టింగ్ కలను నెరవేర్చుకునేందుకు ముంబైకి వచ్చింది. అనేక హిందీ చిత్రాలతో పాటు నూర్ వెబ్ సిరీస్‌లలో కూడా కీలక పాత్రలు పోషించింది. నూర్ మలాబికా దాస్ వయస్సు 32 సంవత్సరాలు. ఆమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండేది. ఆమె నటించిన కొన్ని సినిమాలు, సిరీస్ లు హిట్ కావడంతో పాపులారిటీ బాగానే పెరిగింది. సోషల్ మీడియాలో కూడా నూర్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు