Tollywood: మహేష్, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ నకిలీ హీరోలు.. బాలీవుడ్ ఫోటోగ్రాఫర్ షాకింగ్ కామెంట్స్..!

Tollywood: ప్రస్తుత కాలంలో స్టార్ హీరోలని, హీరోయిన్లని ఎవరు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఒకానొక సమయంలో స్టార్ హీరో మరియు హీరోయిన్ అంటే ఒక హోదా ఉండేది. కానీ ప్రజెంట్ జనరేషన్ లో స్టార్ హీరో అయితే మాకేంటి హీరోయిన్ అయితే మాకేంటి అనేటట్లు బిహేవ్ చేస్తున్నారు.

ఇక ఈ క్రమంలోనే పలువురు స్టార్ హీరో, హీరోయిన్ల పై కామెంట్స్ చేస్తున్నారు కూడా. గతంలో వారిని ఏమైనా అంటే అనేక ప్రాబ్లమ్స్ వస్తాయి అని భయపడేవారు. కానీ ప్రజెంట్ ఉన్నవారు మొహమాటం పడకుండా ఎంతటి ఫాలోయింగ్ ఉన్న హీరోని అయిన తిట్టేస్తున్నారు. ఇదే క్రమంలో ఓ ఫోటోగ్రాఫర్ కూడా తనదైన రీతిలో ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

Bollywood photographer shocking comments
Bollywood photographer shocking comments

సౌత్ యాక్టర్లు బయట కనిపించే అంత విధేయతగా అస్సలు ఉండరని బాలీవుడ్ ఫోటోగ్రాఫర్ వీరేందర్ విమర్శించారు. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ నకిలీగా ఉంటారు అని వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన మాట్లాడుతూ..” VDK సింపుల్ గా ఉన్నట్లు చూపించుకోవడానికి మూవీ ప్రమోషన్స్ కు చెప్పులతో వచ్చారు. ఎన్టీఆర్ హోటల్ కు వెళ్తుండగా ఎవరో ఫోటో తీస్తే వేరే వ్యక్తిపై కోప్పడ్డారు. తనను బాలీవుడ్ పరిచయం లేదని మహేష్ చెప్పారు ” అంటూ పేర్కొన్నారు. ప్రజెంట్ ఈయ‌న‌ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు