Bollywood : ఆ స్టార్ హీరో వల్ల ప్రొడ్యూసర్ ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది!

Bollywood : బాలీవుడ్ లో కరోనా లాక్ డౌన్ తర్వాత ఇండస్ట్రీ చాలా దెబ్బతిన్నదనే చెప్పాలి. కరోనా నుండి బాలీవుడ్ కి కోలుకోవడానికి మూడేళ్లు పట్టిందని చెప్పాలి. ఇక లాస్ట్ ఇయర్ లో మంచి హిట్లే వచ్చాయి హిందీ ఇండస్ట్రీకి. కానీ ఈ ఇయర్ మళ్ళీ గాడి తప్పింది. దాదాపు ఈ ఏడాది సగం గడిచిపోగా, ఒక్క పెద్ద సినిమా హిట్ అవలేదు. ఇదిలా ఉండగా స్టార్ హీరోలు కూడా కంటెంట్ ఉన్న సినిమాలని సెలెక్ట్ చేసుకోవడం లేదు. పూలు అమ్మిన చోటే కట్టెలు అమ్మాల్సి రావడం పాత సామెతే అయినా సినీ పరిశ్రమలో ఇది ఎన్నోసార్లు రుజువైన సత్యం. కాకపోతే కొన్నిసార్లు పరిణామాలు మరీ దారుణంగా ఉంటాయి. అయితే స్టార్ హీరోల్లో కొందరి టేస్ట్ మాత్రం అస్సలు మారడం లేదు. దెబ్బ మీద దెబ్బ పడ్డా ఒకే మూసధోరణిలో ఒకే కథలతో మళ్ళీ మళ్ళీ వస్తుంటారు. అలాంటి బాలీవుడ్ హీరోలలో టైగర్ ష్రాఫ్ ఒకరు. ఈ హీరో కెరీర్ బిగినింగ్ లో మంచి సినిమాలే చేసినా, ఆ తర్వాత రొటీన్ స్కిప్ట్ లతో ప్రేక్షకుల్ని మెప్పించలేకపోతున్నాడు. ఈ క్రమంలో తన చివరి రెండు సినిమాలతో బాలీవుడ్ (Bollywood) లో భారీ డిజాస్టర్లు అందుకోగా, ఆ సినిమాల వల్ల నిర్మాత ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

Bollywood producer who sold properties due to Tiger Shroff films

ఈ సినిమాల వల్ల ఆస్తులు అమ్ముకున్న హీరో!

ఇక అసలు విషయానికి వస్తే.. బాలీవుడ్ లో పూజా ఎంటర్ టైన్మెంట్స్ ది నాలుగు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర. దాని అధిపతి వశు భగ్నాని గురించి తెలియని వారు ఉండరు. స్టార్ హీరోలు అందరితోనూ ఎన్నో బ్లాక్ బస్టర్లు తీసిన ట్రాక్ రికార్డు ఆయనది. అలాంటి టాప్ ప్రొడ్యూసర్ తలమీద వచ్చి కూర్చున్న 250 కోట్ల నష్టాలను పూడ్చుకోవడం కోసం ఏడు ఫ్లోర్లు ఉన్న తన విశాలమైన ఆఫీసుని అమ్మేయడం చాలా పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఇదొక్కటే కాదు జనవరి నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా 80 శాతం ఉద్యోగులకు స్వస్తి చెప్పడం సంస్థ పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది. ఇలా జరగడానికి కారణం గత కొన్ని నెలల్లో భగ్నానీని దారుణంగా దెబ్బ తీసిన డిజాస్టర్లు. ముఖ్యంగా దీనికి ప్రధాన కారణం ఓ రెండు బడా సినిమాలు. ఒకటి “బడేమియా చోటేమియా” కాగా రెండోది “గణపథ్”. ఇవి ఎంత ఘోరంగా ఫ్లాప్ అయ్యాయంటే రెండో రోజే థియేటర్లు ఖాళీ అవుతున్నాయని డిస్ట్రిబ్యూటర్లు గగ్గోలు పెట్టారు. ఇక ఈ రెండింట్లో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించగా, ఒక సినిమాలో అక్షయ్ కుమార్ తో స్క్రీన్ షేర్ చేసుకోగా, మరో సినిమాలో అమితాబ్ బచ్చన్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు.

- Advertisement -

ఇకనైనా హీరోలు, నిర్మాతలు మారాలి…

ఇక టైగర్ ష్రాఫ్ నటించిన గణపత్ గత ఏడాది భారీ అంచనాలతో వచ్చి డిజాస్టర్ అందుకుంది. ఇక ఈ ఇయర్ బడేమియా చోటేమియా సినిమాలతో వచ్చి డిజాస్టర్లు అందుకున్నాడు. ఈ రెండు సినిమాలతో నిర్మాత వశు భగ్నాని 250 కోట్లకి పైగా నష్టపోయాడట. అలా అని ప్రొడక్షన్ ని ఆయనేమి ఆపడం లేదు కానీ, కార్యకలాపాలను మరో చిన్న ఆఫీసుకి షిఫ్ట్ చేశారు. ఇక కంటెంట్ లేకుండా కాంబినేషన్ హైప్ ల వల్ల సినిమాలు ఆడుతాయనుకునే బాలీవుడ్ మేకర్స్ కి ఇలా ప్లాప్ లు తగులుతేనె మళ్ళీ ఇలాంటి సినిమాలు తీయకుండా ఉంటారని అంటున్నారు. ఇదిలా ఉండగా టైగర్ ష్రాఫ్ కూడా ఇకనైనా కొన్నాళ్ళు ఆక్షన్ సినిమాలని తగ్గించి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తే మంచిదని నెటిజన్లు అంటున్నారు.

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు