Prasanth Varma : ‘జై హనుమాన్’ లో ఊహించని ట్విస్ట్… బాలీవుడ్ బడా హీరోనే దించుతున్నారుగా..

Prasanth Varma : ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసిన సినిమా హనుమాన్ కు సీక్వెల్ గా జై హనుమాన్ సినిమా రాబోతుందని తెలిసిందే.. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పటివరకు స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి అవ్వలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాతో నేషనల్ వైడ్ టాక్ ను సంపాదించుకున్నాడు డైరెక్టర్ ప్రశాంతవర్మ.. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా దాదాపు రూ. 400 కోట్లు రాబట్టడం మామూలు విషయం కాదు.

ఈ సినిమాతో ప్రశాంత్ తన పేరుతో ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసి అందులోనే వరుస సినిమాలు చేసేందుకు సిద్దమైన సంగతి తెలిసిందే. ఇక అందులో భాగంగానే ప్రస్తుతం ఆయన హనుమాన్ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ తెరకెక్కుస్తున్నారు. ఈసారి మరింత భారీ బడ్జెట్ తో, అద్భుతమైన విజువల్స్ ప్రేక్షకులను మరింత థ్రిల్ చేయడానికి రెడీ అవుతున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. మొన్నామధ్య హనుమాన్ జయంతి సందర్భంగా ఓ అప్డేట్ ను వదిలారు.. ఆ తర్వాత సైలెంట్ గా ఉన్నాడు..

Bollywood star hero entry in Jai Hanuman movie
Bollywood star hero entry in Jai Hanuman movie

ఇదిలా ఉండగా.. ప్రశాంత్ వర్మ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడన్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ముచ్చటించాడు. ఈ ఈమేరకు ఓ నెటిజన్ జై హనుమాన్ సినిమా పురాణాలకు సంబంధించింది కదా మరి అశ్వత్థామ పాత్ర కూడా ఉంటుందా అని అడిగాడు. దానికి సమాధానంగా ప్రశాంత్ స్పందిస్తూ.. దాని గురించి ఇప్పుడు నేను ఖచ్చితంగా చెప్పలేను కానీ, మీరు ఊచించే ప్రతీ పాత్ర ఉంటుందని హింట్ ఇచ్చాడు. ఈ వార్త కనుక నిజం అయితే మాత్రం బాక్సాఫీస్ షేక్ అవ్వడం పక్కా అని హనుమాన్ అభిమానులు ప్రచారం చేస్తున్నారు.. ప్రస్తుతం ఈ వార్త ఓ రేంజులో వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోలు నటిస్తున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు