Bollywood: నాలుగో సారి ఉత్తమ నటిగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్

అలియా భట్. ఈ హీరోయిన్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చినా తన సొంత టాలెంట్ తో వరుస హిట్లు కొట్టి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రముఖ దర్శకనిర్మాత మహేష్ భట్ కూతురిగా బాలీవుడ్ లో 2012 లో స్టూడెంట్ అఫ్ ది ఇయర్ సినిమా తో హీరోయిన్ గా పరిచయమైన ఈ భామ 2 స్టేట్స్, హంప్టీ శర్మ కి దుల్హనియా, వరుస హిట్ల తో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. 2016 లో వచ్చిన ఉడ్తా పంజాబ్ తో నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది.

2022 అలియా భట్ కి గోల్డెన్ ఇయర్ గా చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం అలియా భట్ నటించిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. తను హీరోయిన్ గా నటించిన ఆర్ఆర్ఆర్, బ్రహ్మాస్త్ర సినిమాలతో పాటు తాను ఫిమేల్ లీడ్ గా నటించిన గంగూబాయి ఖతియవాడి కూడా సూపర్ హిట్ అయింది. అంతే కాక నటుడు రణబీర్ కపూర్ ని 2022 లోనే ప్రేమించి పెళ్లి చేసుకుంది.

తాజాగా అలియా భట్ కి మరోసారి అదృష్టం వరించింది. అలియా భట్ హీరోయిన్ గా నటించిన గంగూబాయి ఖతియవాడి చిత్రానికి గాను బెస్ట్ హీరోయిన్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డు ని గెలుచుకుంది. అయితే అలియా భట్ ఉత్తమ నటిగా అవార్డు ని అందుకోవడం ఇది నాలుగోసారి కావడం విశేషం. ఇంతకు ముందు అలియా భట్ తాను హీరోయిన్ గా నటించిన ఉడ్తా పంజాబ్, రాజి, గల్లీ బాయ్ చిత్రాలకు ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకుంది. ఇక గంగూబాయి సినిమా తో నాలుగోసారి గెలుచుకుంది. ఈ అవార్డు ను అలియా భట్ బాలీవుడ్ సీనియర్ నటి “రేఖ” చేతులమీదుగా అందుకోవడం విశేషం.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు