Bollywood Star heroine: స్టార్ బ్యూటీ ని గుర్తుపట్టగలరా..?

Bollywood Star heroine..నిరంతరం తన కెరియర్ లో ఎన్నో సవాళ్లతో కూడుకున్న పాత్రలను చేయడమే కాదు, కొత్త తరహా పాత్రలతో ప్రేక్షకులను ఉత్సాహపరుస్తూ వుండే అతి తక్కువ మంది నటీమణులలో అందాల ముద్దుగుమ్మ ఆలియా భట్ కూడా ఒకరు.. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే..RRR చిత్రంతో భారీ విజయాన్ని అందుకుంది. బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతోంది. సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. పలు రకాల బ్రాండ్లకు అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తూ ఉంటుంది.

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన అలియా భట్..

Bollywood Star heroine: Can you remember the star beauty..?
Bollywood Star heroine: Can you remember the star beauty..?

తాజాగా మ్యాగజైన్ ఇంటర్వ్యూలో తన దుస్తుల బ్రాండ్ గురించి ప్రస్తావించింది ఆలియా భట్.. అందుకు సంబంధించి ఫోటోషూట్ లో కుర్రకారుకు హీట్ పుట్టించేలా గ్లామరస్ ఫోజులతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.. ప్రముఖ మ్యాగజైన్లలో ఒకటైన బజార్ ఇండియా ఫోటోషూట్ లో ఆలియా లుక్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.. ఈ ఫోటో చూసిన వారందరూ కూడా ఇందులో ఉన్నది ఆలియా నేనా అని.. గుర్తు పట్టడం చాలా కష్టంగా ఉంది అంటూ కూడా తెలియజేస్తున్నారు. ఈమె మేకోవర్ అంతలా మారిపోయిందని చెప్పవచ్చు. 2020లో కూడా ఆలియాభట్ పిల్లల ప్రసూతి దుస్తుల బ్రాండ్లను కూడా ప్రమోట్ చేయడం జరిగింది. అయితే ఇందులో 51% వరకు ఆలియా భట్ వాటాను కలిగి ఉన్నదట.

అంబానీ తో కూడా భాగస్వామ్యం..

అలాగే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కూడా రిలయన్స్ అంబానీతో తన వ్యాపార భాగస్వామ్యం గురించి మరొకసారి తెలియజేసింది ఆలియా భట్. మా జాయింట్ వెంచర్ విభిన్నమైన ఉత్పత్తుల వర్గాల నుంచి మంచి పేరు వస్తోందని దీంతో ఇండియాలో తమ రిటైల్ ఉనికి కూడా విస్తరించింది అంటూ ఆలియా భట్ తెలిపింది. ప్రధానంగా ఆన్లైన్ అమ్మకాలు కూడా ఇప్పుడు కొనసాగిస్తున్నామని.. దేశవ్యాప్తంగా 84 వేర్వేరు ప్రాంతాలలో కూడా తమ దుస్తులు అందుబాటులో ఉంటున్నాయి అంటూ తెలిపింది. అంతేకాకుండా ప్రముఖ నగరాలు అయినటువంటి ఢిల్లీ, ముంబై , పూణే , బెంగళూరు ఇతరత్ర ప్రాంతాలలో బ్రాండ్ అవుట్ లెట్ లు కూడా తెరవాలనే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నామంటూ వెల్లడించింది. ముఖ్యంగా ఇందులో ఇంటికి సంబంధించి పుస్తకాలు, పిల్లలకు సంబంధించి అన్నిటిని కూడా ఒకే గొడుగు కిందికి తేవాలని ప్రయత్నిస్తున్నామని తెలిపింది.

- Advertisement -

అలియా భట్ సినిమాలు..

అలియా భట్ సినిమాల విషయానికి వస్తే..ఈమె ప్రస్తుతం వేదంగ్ రైనా నటించిన జిగ్రా సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ తో కలిసి ఈ ముద్దుగుమ్మ నిర్మిస్తున్నట్లు సమాచారం.. ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 27న థియేటర్లో రాబోతున్నది. అలాగే కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రా , ఆలియా కాంబినేషన్లో ఒక సినిమా రాబోతున్నట్లు తెలియజేసింది. ఇవే కాకుండా YRF స్పై యూనివర్సిటీలో కూడా ఒక యాక్షన్ చిత్రంలో నటిస్తున్నట్లుగా వెల్లడించింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న అలియాబట్ మరొక సినిమాతో ప్రేక్షకులను అలరించాలని తెలుగు ప్రేక్షకులు కోరుకుంటున్నారు. మరి ఏ మేరకు ఈమె తెలుగులో అవకాశాలు అందుకుంటుందో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు