Bollywood : ఆ స్టార్ హీరో వీసా రద్దు చేసిన దేశం.. హీరో ట్రొలింగ్..

Bollywood : బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మూడున్నర దశాబ్దాలుగా బాలీవుడ్ లో తనదైన శైలిలో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఒకప్పుడు హీరోగా సినిమాలు చేయగా, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తున్నాడు. ఇక కెజిఎఫ్2 తరువాత సౌత్ లో కూడా బిజీ అయిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ లో కూడా నటించాడు సంజయ్ దత్. ఈ సినిమా ఆగష్టు 15న విడుదల అవుతుంది. ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ బాలీవుడ్ ప్రమోషన్లలో ఉన్న సంజు ఇక తన తదుపరి సినిమాలపై దృష్టి పెట్టనున్నాడు. ఇదిలా ఉండగా సంజయ్ దత్ కి తాజాగా ఓ చేదు అనుభవం ఎదురయింది. సంజయ్ దత్ వీసా ని ఓ దేశం రద్దు చేస్తూ షాకిచ్చింది.

Bollywood star Sanjay Dutt's visa canceled by UK government

సంజయ్ వీసా రద్దు చేసిన దేశం..

అయితే తాజాగా సంజయ్ దత్ వీసా ని ఓ దేశం రద్దు చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… అజ‌య్ దేవ‌గ‌ణ్, సంజ‌య్ ద‌త్, ప్ర‌ధాన పాత్ర‌ల్లో విజ‌య్ కుమార్ ఆరోరా ద‌ర్శ‌క‌త్వంలో ‘స‌న్నాఫ్ స‌ర్దార్-2’ సినిమా తెరకెక్కుతుంది. పదేళ్ల కింద వచ్చిన సన్నాఫ్ సర్దార్ కి సీక్వెల్ ఈ సినిమా. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం యూకే లో జ‌రుగుతోంది. సినిమాలో మెయిన్ లీడ్ అంతా యుకె లోనే ఉంది. అయితే సంజయ్ దత్ ని మాత్రం తమ దేశం రాకూడదంటూ, యూకే ప్ర‌భుత్వం సంజ‌య్ ద‌త్ వీసాని ర‌ద్దు చేసింది. దీంతో ఈ విషయం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ప్ర‌స్తుతం ఎలాంటి వివాదాల్లో కూడా లేని సంజ‌య్ ద‌త్ పై ఈ వీసా రద్దు విషయంపై బాలీవుడ్ లో చర్చ నడుస్తుంది.

- Advertisement -

వీసా రద్దు కారణం ఇదే?

అయితే సంజయ్ దత్ వీసా రద్దు చేయడానికి యుకె ప్రభుత్వం దానికి కారణాలు చెప్పుకొచ్చింది. ‘వీసా మంజూరు చేసిన నెల రోజుల త‌ర్వాత సంజ‌య్ ద‌త్ గత జైలు జీవితం సాకుగా చూపుతూ యుకే ప్ర‌భుత్వం సంజయ్ దత్ వీసా ర‌ద్దు చేసిందట. గతంలో ఇంతకు ముందు కూడా కొన్ని జరిగినా అప్పటికప్పుడు పరిష్కారం అయ్యాయి. అయితే దీనిని సంజయ్ దత్ స్పందింస్తూ… అన్ని పేమెంట్స్ ప‌క్కాగా జ‌రిగాక ర‌ద్దు చేయ‌డం ఏంట‌ని సంజయ్ ద‌త్ ప్రశ్నించారు. ఇలా తనకు ఎక్కడా జరగలేదని, అన్ని దేశాలకు వెళ్ళొచ్చానని అన్నాడు. ఇక దీనిని సంజయ్ దత్ అసహనం వ్యక్తం చేస్తూ… అయినా అల్ల‌ర్లు జ‌రుగుతోన్న ఆ దేశం ఎవ‌రు వెళ్తారు? వెళ్ల‌డానికి నేను కూడా సిద్దంగా లేను’ అని సంజయ్ దత్ యుకె పై సెటైర్ వేసాడు. ఇక జైలు జీవితం గడపడమే కారణమంటే చాలా మంది నటులు జైలుకు వెళ్లొచ్చారు. పలువురు పొలిటీషియన్స్ కూడా జైలుకి వెళ్లొస్తూ ఉంటారు. మరి వాళ్ళకి ఏ అడ్డు చెప్పలేదే అని కొందరు నెటిజన్లు యుకె ప్రభుత్వంపై సెటైర్లు వేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు