Bollywood Stars: IVF ద్వారా తల్లిదండ్రులైన బాలీవుడ్ జంటలివే..!

Bollywood Stars…చాలామంది సెలబ్రిటీలు వివాహం జరిగిన తర్వాత తల్లి అవ్వాలని.. తాము కూడా అమ్మానాన్నలుగా పిలిపించుకోవాలనే కోరిక ఉండనే ఉంటుంది.. కానీ మరి కొంతమంది మాత్రం అందం పాడవకుండా ఉండేందుకు సరోగసి పద్ధతి ద్వారా పిల్లల్ని కంటూ ఉంటారు.. మరి కొంతమంది తమకు ఉన్న సమస్యల వల్ల ఐవీఎఫ్ పద్ధతి ద్వారా పిల్లల్ని కనడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కొన్ని అనారోగ్య సమస్యలపై కొంతమంది బాలీవుడ్ సెలబ్రిటీలు IVF పద్ధతినీ ఎంచుకొని సంతానం మరి ఇలా ఐవిఎఫ్ ద్వారా ఎవరెవరు తల్లిదండ్రులుగా మారారో ఇప్పుడు చూద్దాం..

Bollywood Stars: Bollywood couples who became parents through IVF..!
Bollywood Stars: Bollywood couples who became parents through IVF..!

ప్రియాంక చోప్రా:
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరుపొందిన ఈమె ప్రస్తుతం హాలీవుడ్లో ఒక వెలుగు వెలుగుతోంది. ఈమె భర్త నిక్ జోనస్ సహాయంతో 2022లో జనవరి 15న IVF పద్ధతి ద్వారా కుమార్తెకు జన్మనిచ్చారు.

ప్రీతిజింతా:
బాలీవుడ్ నటిగానే కాకుండా ఐపీఎల్ క్రికెట్ జట్టు సహ యజమానిగా కూడా పేరు సంపాదించుకుంది. ప్రీతిజింతా.. 2016 లో జీన్ గూడనఫ్ వివాహం చేసుకున్న ఈమె చాలా సంవత్సరాలకు తల్లి అయింది అయితే ఈ జంట కూడా IVF పద్ధతి ద్వారానే ఒక అబ్బాయికి మరియు ఒక అమ్మాయికి జన్మనిచ్చినట్లు తెలుస్తోంది.

- Advertisement -

శిల్పా శెట్టి:

టాలీవుడ్ , బాలీవుడ్లో పలు చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి ,రాజకుంద్రాను 2009 లో వివాహం చేసుకుంది. అయితే తన మొదటి బిడ్డకు జన్మనిచ్చిన శిల్పా శెట్టి, ఆ తర్వాత 2012లో APLA అని ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడింద్. దాదాపు ఐదు సంవత్సరాల వరకు చాలా ఇబ్బందులు ఎదుర్కొందట. ఆ తర్వాత IVF పద్ధతి ద్వారా ఒక కుమార్తెకు 2020 లో జన్మనిచ్చింది.

సన్నీ లియోన్:

బోల్డ్ బ్యూటీగా పేరుపొందిన సన్నీలియోన్ IVF పద్ధతి ద్వారానే తల్లి అయ్యింది. 2017లో నిషాను దత్తత తీసుకుంది. ఆ తర్వాత ఆమెకు 2018 లో ఇద్దరు కుమారులు సరోగసి ద్వారా జన్మించారు.

షారుక్ ఖాన్:

బాలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన షారుఖ్ ఖాన్ తన భార్య గౌరీ ఖాన్ మూడో బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్నప్పుడు IVF పద్ధతి ద్వారానే కన్నారట.

కరణ్ జోహార్:

బాలీవుడ్ లో నిర్మాతగా పేరుపొందిన కరణ్ జోహార్ తన కవల పిల్లలకు ఒక అబ్బాయి మరియు ఒక అమ్మాయి కి ఐ వి ఎఫ్ ద్వారా జన్మించినట్లు తెలియజేశారు.

అమీర్ ఖాన్:
అమీర్ ఖాన్ మరియు కిరణ్ రావు 2009లో గర్భస్రావం జరిగిన తర్వాత 2011లో తమ కుమారులు ఆజాద్ ను IVF పద్ధతి ద్వారా స్వాగతించారు. ఈ విషయాన్ని స్వయంగా అమీర్ ఖాన్ చాలా ఓపెన్గా తెలియజేశారు.

ఇలా చాలామంది సెలబ్రిటీలు పిల్లలను కనడానికి ఐవీఎఫ్ లేదా సరోగసిని ఎంచుకొని తల్లిదండ్రులు అవుతున్నారు .ప్రస్తుతం ఈ విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు