Ananth Ambani: అంబానీ ఇంట ఆర్ఆర్ఆర్ మ్యాజిక్.. స్టెప్పులతో అదరగొట్టిన బాలీవుడ్ స్టార్స్..!

ప్రముఖ వ్యాపారవేత్తగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేతగా ముకేశ్ అంబానీ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు.. ఇక ఈయన ఇంట పెళ్లి సంబరాలు అంటే ఏ రేంజ్ లో ఉంటాయో కూడా అర్థం చేసుకోవచ్చు.. ఇటీవలే అంబానీ ఇంట ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం మరికొన్ని రోజులలో జరగబోతోంది.. దీంతో ఇప్పుడు గుజరాత్ లోని జామ్ నగర్ లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సైతం చాలా గ్రాండ్గా నిర్వహించారు..

ప్రీ వెడ్డింగ్ లో స్టార్స్ హంగామా..
మార్చి 1వ తేదీన ప్రారంభమైన ఈ సెలబ్రేషన్స్ నేటితో ముగియనున్నాయి.. మొదటి రోజు వరల్డ్ పాప్ సింగర్ రిహాన్న తన ప్రదర్శనలతో అందరిని ఆకట్టుకున్నారు మొదటిసారి ఇండియాలో ప్రదర్శించిన రిహాన్నా.. ఇందుకుగానూ రూ.74 కోట్లు తీసుకున్నారు..రెండవ రోజు సంగీత్ లో బాలీవుడ్ స్టార్స్ అందరూ కూడా చాలా సందడి చేశారు.. ఇతర దేశాల నుంచి కూడా పలువురు వ్యాపారవేత్తలు వచ్చి ఇండియన్ దుస్తులను ధరించి అదరగొట్టేశారు.. ఈ వేడుకలలో భాగంగా RRR మ్యూజిక్ మరొకసారి హైలెట్ గా మారింది. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు బాలీవుడ్ స్టార్స్ సైతం డాన్స్ వేశారు.

నాటు నాటు పాటకి స్తెప్పులేసిన బాలీవుడ్ స్టార్స్..
నాటు నాటు పాటకి అదిరిపోయే స్టెప్పులతో బాలీవుడ్ స్టార్స్ ఇరగదీసారు.. ముఖ్యంగా సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారుక్ ఖాన్ వంటి వారు ఈ పాటకు డాన్స్ వేసి అందరితో శభాష్ అనిపించుకున్నారు.. అయితే ఈ ముగ్గురు స్టార్ హీరోలు చాలా కాలం తర్వాత ఒకే స్టేజి పైన కలిసి కనిపించారు.. అంతేకాకుండా నాటు నాటు పాటకు కూడా డాన్స్ చేయడం తో ఈవెంట్ కే ప్రత్యేక ఆకర్షణంగా నిలిచారని చెప్పవచ్చు. ఎన్టీఆర్ , రామ్ చరణ్ వేసిన సిగ్నేచర్ స్టెప్పును సైతం మార్చేసి అక్కడున్న వారందరిని ఆనందపరిచారు సల్మాన్.. అనంత్ అంబానీ ఫ్రీ వెడ్డింగ్ లో మాత్రం చాలా హైలెట్ గా మారింది ఈ వీడియో..

- Advertisement -

సల్మన్ , షారుఖ్ లుక్..
ఆ తర్వాత అనంతరం పఠాన్ సినిమాలోని జుమ్ కో పఠాన్ పాటకు అదరగొట్టేశారు.. ఇక చివరిగా చెయ్య పాటకు డాన్స్ వేశారు.. సల్మాన్, షారుక్ ఖాన్ బ్లాక్ కుర్తాలు ధరించగా.. అమీర్ ఖాన్ గ్రీన్ కలర్ కుర్తా లో కనిపించారు.. ఇందుకు సంబంధించిన ఒక వీడియో మాత్రం సోషల్ మీడియాలో అభిమానులను థ్రిల్ కి గురి చేస్తోంది.. బాలీవుడ్ లోని త్రిమూర్తులందరూ ఒకే స్టేజ్ పైన నాటు నాటు పాటకు డ్యాన్స్ వేయడం ఆనందంగా ఉందంటూ పలువురు అభిమానులు , నెటిజన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు.. ఈ వీడియో హిస్టరీ క్రియేటింగ్ మూమెంట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు..

పర్ఫామెన్స్ తో అదరగొట్టిన లేడీ స్టార్స్..
ఆ తర్వాత రణబీర్, ఆలియా, జాన్వీ కపూర్, అనన్య పాండే , సారా అలీఖాన్, దీపిక పదుకొనే తదితరులు సైతం ప్రదర్శనలు జరిగాయి.

ఈవెంట్ లో సందడి చేయనున్న క్రికెట్ స్టార్స్..
అయితే ఈ రోజున సచిన్ టెండుల్కర్, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోని, హార్దిక్ పాండే ఇతరత్రా భారత అథ్లెట్ ల పర్ఫామెన్స్ ఉండబోతున్నట్లు సమాచారం.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు