Bollywood: టాప్-10 బాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యునరేషన్ లిస్ట్.. మొదట ఎవరంటే..?

Bollywood.. ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే హీరోయిన్లకు మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా ఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందంటే చాలు రెమ్యూనరేషన్ కూడా అమాంతం పెంచేస్తూ ఉంటారు. ముఖ్యంగా సౌత్ హీరోయిన్స్ తో పోల్చుకుంటే బాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ విషయంలో భారీగా డిమాండ్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ చాలామంది ఉన్నారు.. అయినా డిమాండ్ కూడా ఎక్కువే.. ఈ నేపథ్యంలోనే అత్యధిక రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తూ ఉంటారు. మరి నార్త్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న టాప్-10 హీరోయిన్స్ గురించి ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.

Bollywood: Top-10 Bollywood heroines remuneration list.. Who is first..?
Bollywood: Top-10 Bollywood heroines remuneration list.. Who is first..?

దీపికా పదుకొనే..

బాలీవుడ్, హాలీవుడ్ లో పలు సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న దీపికా పదుకొనే.. త్వరలో కల్కి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం కానుంది.. ఇప్పుడు బాలీవుడ్లో రెమ్యూనరేషన్ పరంగా నెంబర్ వన్ హీరోయిన్ గా పేరు సంపాదించింది.. దీపికా పదుకొనే ఒక్కో చిత్రానికి రూ.15 నుంచి రూ.30 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. దీంతో ఈ ముద్దుగుమ్మ అక్కడ నెంబర్ వన్ స్థానాన్ని అందుకుంది. దీపికా పదుకొనే ప్రస్తుతం గర్భవతిగా ఉన్నది.. అందుకే సినిమాల విషయంలో కాస్త రెస్టు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. టాలీవుడ్ లో ప్రభాస్ నటించిన కల్కి 2898AD అనే చిత్రంలో నటిస్తోంది.. ఈ సినిమా ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.

కంగనా రనౌత్..

దీపికా తర్వాత కంగాన రనౌత్ రెండవ స్థానంలో ఉన్నది. ఈమె ఒక్కో చిత్రానికి రూ.15 నుంచి రూ.27 కోట్ల రూపాయల వరకు తీసుకుంటుందట. ఇటీవలే లోకసభ ఎంపీగా కూడా మండి నుంచి పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే.

- Advertisement -

ప్రియాంక చోప్రా..

హాలీవుడ్, బాలీవుడ్లో భారీ పాపులారిటీ సంపాదించుకున్న ప్రియాంక చోప్రా.. ప్రస్తుతం సినిమా బడ్జెట్ ను బట్టి ఒక్కో చిత్రానికి రూ .15 నుంచి రూ .25 కోట్ల రూపాయల వరకు తీసుకుంటుందట.

కత్రినా కైఫ్..

బాలీవుడ్లో అత్యధిక రంగుల రేషన్ తీసుకుంటున్న హీరోయిన్స్ జాబితాలో కత్రినా కైఫ్ నాల్గవ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఒక్కో చిత్రానికి రూ.15 నుంచి రూ .25 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తోందట.

అలియా భట్:

బాలీవుడ్ లో నాచురల్ బ్యూటీ గా గుర్తింపు తెచ్చుకున్న అలియా భట్ రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు డిమాండ్ చేస్తోంది.

కరీనా కపూర్:

ఆ తర్వాత స్థానం కరీనాకపూర్.. రూ.8 నుంచి రూ.18 కోట్ల రూపాయల వరకు తీసుకుంటోంది..

ఆ తర్వాత స్థానం శ్రద్దా కపూర్ రూ.7 నుంచి రూ.15 కోట్ల రూపాయల వరకు సినిమాని బట్టి డిమాండ్ చేస్తోందట. ఆ తర్వాత స్థానం విద్యాబాలన్ రూ.8 నుంచి రూ.14 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. అనుష్క శర్మ కూడా రూ.8 నుంచి రూ.11 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటుందట.. చివరిగా ఐశ్వర్యరాయ్.. ఒక్క చిత్రానికి 10 కోట్ల రూపాయలకు పైగా డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. అప్పటికి ఇప్పటికీ ఐశ్వర్యరాయ్ రెమ్యూనరేషన్ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు