Book My Show : రేటింగ్ మానిపులేషన్…. ప్రొడ్యూసర్ల ఆటలు అంతా ఇంత కాదు భయ్యా…!

Book My Show : రోజులు మారుతున్న కొద్ది అనేక రంగాల్లో మార్పులు వచ్చినట్లు సినిమా రంగాల్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. అయితే టెక్నాలజీ పెరగటం వలన ఎంత లాభం ఉందో అంతే నష్టం కూడా ఉంది అని చెప్పాలి. ఒకప్పుడు ఒక సినిమా టికెట్ కావాలి అంటే థియేటర్ దగ్గర గంటలకొద్ది నిలబడాల్సి వచ్చేది. ఇంకా మనకు కొంచెం పలుకుబడి ఉంటే ఏ రాజకీయ నాయకులతోను పోలీస్ ఆఫీసర్లతోనూ పెద్ద సినిమాకు సంబంధించిన టిక్కెట్లను తెచ్చుకునే అవకాశం ఉండేది. ఆ తర్వాత సినిమాలకు సంబంధించిన కొన్ని యాప్స్ రావడం వలన సినిమా టికెట్ తీసుకుని సౌలభ్యం చాలా సులభంగా వచ్చేసింది.

ఆన్లైన్ టికెట్ యాప్స్

సినిమా టికెట్ బుక్ చేసుకోవడానికి చాలా యాప్స్ ఇప్పుడు ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉన్నాయి. బట్ ఎక్కువ రీచ్ ఉన్నది మాత్రం “బుక్ మై షో యాప్” ఒక కొత్త సినిమా వస్తుంది అని అంటే చాలామంది ఈ యాప్ లో టిక్కెట్ల కోసం పడిగాపులు కాస్తూ ఉంటారు. అయితే ఈ యాప్ వలన ఎంత లాభం ఉందో అంతకు మించిన నష్టం కూడా సినీ పరిశ్రమకు ఉంది అని చెప్పొచ్చు. ఒక సినిమాకి సంబంధించిన టికెట్స్ ఈ యాప్ లో అవైలబుల్ గా ఉండడంతో పాటు ఆ సినిమాకు సంబంధించిన రేటింగ్ ఇచ్చే ఆప్షన్స్ కూడా ఇక్కడ ఉండటం అనేది చాలా సినిమాలకు నష్టం కలిగిస్తుంది. దీనివలన రేటింగ్ మానిపులేషన్ జరుగుతుంది.

బుక్ మై షో లోపం ఇదే…

ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సినిమా చూసిన వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది. కానీ సినిమాకి రేటింగ్ ఇచ్చిన వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అంటే ఇదంతా బుక్ మై షో యొక్క లోపమని చెప్పి తీరాల్సిందే. అసలు ఒక సినిమా కూడా చూడకుండా ఆ సినిమాకి రేటింగ్ ఇచ్చే అవకాశం ఎలా ఉంటుంది అని బేసిక్ థాట్ కూడా ఈ యాప్ కి లేకుండా పోయిందా.? ఈరోజు చేతిలో మొబైల్ ఫోన్, దానికి ఇంటర్నెట్ ఉన్న ప్రతి వాడు కూడా సినిమాని జడ్జ్ చేసేస్తున్నారు. ఇదే చాలా ప్రమాదం అనుకుంటే ఆ సినిమా మీద టిక్కెట్ కూడా కొనకుండా ఒపీనియన్ పాస్ చేసే అవకాశం ఈ యాప్ ఇవ్వటం అనేది దారుణం. సినిమా పరిశ్రమకు తీవ్రమైన నష్టం అని చెప్పాలి. ఈ నెగిటివ్ రేటింగ్స్ వలన చేసేదేమీ లేక ప్రొడ్యూసర్స్ కూడా ఒక టీం ను ఫామ్ చేసి పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.ఈ యాప్ డెవలపర్స్ దీనిలో సరికొత్త మార్పులు తీసుకురాక తప్పదు.

- Advertisement -

BookMyShow

పైరసీ కంటే డేంజర్‌గా బుక్ మై షో…

ఒకప్పుడు సినిమా పరిశ్రమ కి పైరసీ వలన నష్టం ఏర్పడేది. ఒక కొత్త సినిమా రిలీజ్ అయింది అని అంటే ఆరోజు సాయంత్రానికి ఆ మరుసటి రోజుకు సిడి మార్కెట్లోకి వచ్చేసేది. దాని వలన కొంత మేరకు నష్టం వచ్చేది. అప్పట్లో దీనిని నియంత్రించడం కోసం స్టార్ హీరోలు సైతం ప్రయత్నించారు. ఇకపోతే ఒకప్పుడు సినిమా బాగుందా లేదా అని తెలియాలి అంటే. సినిమా చూసి వచ్చిన వారు చెప్పాలి. లేదంటే కొన్ని రోజుల తర్వాత న్యూస్ పేపర్ లో చదువుకుని రివ్యూ తెలుసుకొనేవాళ్ళు. కానీ ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళు చూడని వాళ్ళు కూడా బుక్ మై షో లో రేటింగ్స్ ఇవ్వటం మొదలుపెట్టారు.

నిర్మాతల ఆటలు…

బుక్ మై షోలో ఉన్న లోపం స్పష్టంగా తెలుస్తుంది. దీన్ని నిర్మాతలు తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు. ఫస్ట్ షో నుంచి నెగిటివ్ టాక్ వచ్చిన సినిమాకు బుక్ మై షోలో రేటింగ్ విషయంలో మానిపులేట్ చేసి… ఆడియన్స్ ను తప్పుదొవ పట్టిస్తూ తమ సినిమావైపునకు మళ్లించుకుంటున్నారు. నిజానికి ఓ సగటు ఆడియన్ ఓ మంచి సినిమాకు వెళ్లాలని అనుకుంటాడు. కానీ, ఇక్కడ నిర్మాతలు అండ్ మూవీ టీం కలిసి ఆడుతున్న ఆటల వల్ల ఓ మూవీ లవర్ సరైన మూవీని బుక్ మై షో నుంచి ఎంపిక చేసుకోలేక పోతున్నాడు. దీనికి అంతటికి కారణం బుక్ మై షో లో ఉన్న లోపమే అయినా, దాన్ని మిస్ యూజ్ చేస్తున్న ప్రొడ్యూసర్లది కూడా కొంత వరకు తప్పే.

ఈ మధ్య ఓ మూవీ టీం వాళ్లు స్పష్టంగా మాట్లాడారు… తమ సినిమాకు నెగిటివ్ రేటింగ్స్ వస్తున్నాయి. దాన్ని కవర్ చేయడానికి ఇలా చేయ్యాల్సి వస్తుందని, అంటే… మూవీ టీంలు దీన్ని మిస్ యూజ్ చేస్తున్నాయి అనేది పూర్తిగా స్పష్టమవుతుంది.ఇలాంటి మిస్ యూజ్ లు, మానిపులేషన్స్ ఇలాగే జరిగితే… #BanBookMyShow అంటూ సిని లవర్స్ నెట్టింట కామెంట్స్ పెట్టే రోజులు దగ్గర్లోనే ఉంటాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు