Boyapati: ప్రతిసారి ఇదే తంతు ఎంత మంది మ్యూజిక్ డైరెక్టర్స్ తో గొడవ పెట్టుకుంటాడో

Boyapati: భద్ర సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు బోయపాటి శ్రీను. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ ని సాధించింది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నిర్మించిన ఈ సినిమా, ఆ సంస్థకు కూడా మంచి పేరును తీసుకొచ్చింది. ఈ సినిమా రవితేజ కెరీర్ లో మంచి ప్లస్ అయిందని కూడా చెప్పొచ్చు. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ కొరటాల శివ రైటింగ్ ఇవన్నీ కూడా ఈ సినిమాను హిట్టు దిశగా మలిచాయి.

ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన సినిమా తులసి. వెంకటేష్ నయనతార జంటగా నటించిన సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనిపించుకుంది. ఈ సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణ తో సింహ అనే సినిమాను తరికెక్కించాడు. బోయపాటి శ్రీను. ఈ సినిమా అప్పట్లో ఒక సంచలనాత్మకమైన హిట్ సినిమా అని చెప్పొచ్చు. బాలకృష్ణ కెరియర్ సక్సెస్ లేక సతమతమవుతున్న తరుణంలో ఈ సినిమా వచ్చి ఒక ఘన విజయాన్ని అందించింది.

ఆ సినిమా తర్వాత వెంటనే ఎన్టీఆర్ తో దమ్ము అనే సినిమాను తెరకెక్కించాడు బోయపాటి శ్రీను. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని ఇవ్వలేదు. అప్పటికే వరుస డిజాస్టర్లతో వెళుతున్న తార కెరియర్ కు ఇది కూడా ఒక డిజాస్టర్ గా మిగిలిపోయింది. దమ్ము సినిమా తర్వాత మళ్లీ బోయపాటి శ్రీను నందమూరి బాలకృష్ణ తో లెజెండ్ అనే సినిమాను తెరకెక్కించాడు.

- Advertisement -

ఇకపోతే లెజెండ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘనమైన విజయాన్ని సాధించింది. బాలకృష్ణ అభిమానులకు ఒక విజువల్ ట్రీట్ అనిపించింది. బాలకృష్ణ నుంచి అభిమానులు ఏం కోరుకుంటారో ఏం చేస్తే బాలకృష్ణ అభిమానులు ఇష్టపడతారు దానిని క్లారిటీగా తెలిసిన దర్శకుడు బోయపాటి శ్రీను అనిపించుకున్నాడు. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్తో సరైనోడు అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా పరవాలేదు అనిపించుకుంది.

Boyapati Srinu

దేవిశ్రీప్రసాద్ స్పందిస్తూ

ఇకపోతే లెజెండ్ సినిమాకి సంబంధించి సక్సెస్ ఈవెంట్ లో మాట్లాడుతూ ఈ సినిమాకి మ్యూజిక్ నేను చాలా దగ్గరుండి చేయించుకున్నాను అంటూ ఒక సందర్భంలో అంటాడు బోయపాటి. ఆన్ స్టేజ్ దానిపై దేవిశ్రీప్రసాద్ స్పందిస్తూ నాతో ఎవరు పని చేయించుకోవలసిన అవసరం లేదు పని ఉంది అని అంటేనే నాకే నిద్ర పట్టదు నేను పని రాక్షసుడిని నా గురించి ఇండస్ట్రీలో అందరికీ తెలుసు అంటూ అక్కడికక్కడే కౌంటర్ ఇచ్చాడు. దాన్ని బోయపాటి కవర్ చేసే ప్రయత్నం చేశాడు కానీ చేయలేకపోయాడు.

క్రెడిట్ విషయంలో

ఇక అఖండ సినిమా హిట్ అయిన తర్వాత ఒక సందర్భంలో మాట్లాడుతూ తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లేకుండా చూసినా కూడా సేమ్ హై ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇకపోతే అక్కడే సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంత పెద్ద ప్లస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాకి సంబంధించి తమన్ సిగ్నేచర్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇలానే క్రెడిట్ విషయంలో కూడా కొరటాల శివకు ఇవ్వలేదు అని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు కూడా తమన్ కాకుండా వేరే సంగీత దర్శకుడుని బోయపాటి తీసుకుంటాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఇలా ఎంతమందితో గొడవ పెట్టుకుంటాడు అంటూ కొంతమంది శ్రీను ని కామెంట్ చేయడం మొదలుపెట్టారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు