Boyapati Srinu: అది ఉండాలి , ఇది ఉండాలి అందుకే అడ్వాన్స్ తీసుకొని, ఇంకో ప్రాజెక్ట్ ముందుకు

Boyapati Srinu: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మాస్ కమర్షియల్ డైరెక్టర్స్ లో బోయపాటి శ్రీను ఒకరు. భద్ర సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బోయపాటి శ్రీను మొదటి సినిమాతోనే ఒక మాస్ డైరెక్టర్ గా పేరు సాధించుకున్నాడు. బోయపాటి శ్రీను ఒక కమర్షియల్ సినిమా డిజైన్ చేసినట్టుగా ఇంకెవరూ చేయలేరు అని చెప్పాలి. ఈయన సినిమాల్లో యాక్షన్ సీక్వెన్సెస్ అద్భుతంగా ఉంటాయి. ఒక బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చే సినిమాలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు వీరి కాంబినేషన్లో మొత్తం మూడు సినిమాలు వచ్చాయి ఈ మూడు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్లు గా నిలిచాయి.

బోయపాటి శ్రీను అల్లు అర్జున్ కాంబినేషన్లో ఇదివరకే వచ్చిన సినిమా సరైనోడు. ఆ సినిమా కూడా కమర్షియల్ గా మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు మళ్లీ అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకుడిగా ఒక సినిమాను చేయబోతున్నట్లు అప్పట్లో వార్తలు వినిపిస్తూ వచ్చాయి. రీసెంట్ టైమ్స్ లో వీళ్లు చాలా సైలెంట్ గా ఉండటం వలన, ఈ ప్రాజెక్టు ఆగిపోయింది అని అనుకున్నారంతా. ఈ ప్రాజెక్టు గురించి నిర్మాత బన్నీ వాసు సరైన క్లారిటీ ఇచ్చాడు. పుష్ప 2 సినిమాతో పాటు ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బోయపాటి శ్రీను ఇచ్చాము. కానీ అది కొంచెం లేట్ అవుతుంది. అందువలన బోయపాటి శ్రీను గారు వేరే ప్రాజెక్టు చేస్తున్నారు అంటూ క్లారిటీ ఇచ్చాడు బన్నీ వాసు.

Allu Arjun

- Advertisement -

ఇక రీసెంట్ గాని బోయపాటి శ్రీను బాలకృష్ణతో మరో సినిమాను అనౌన్స్ చేశారు. ఆ సినిమాని అనౌన్స్ చేసినప్పుడే అల్లు అర్జున్ తో సినిమా ఆగిపోయిందా అని అందరికీ డౌట్ వచ్చింది. అయితే ప్రస్తుతం వీరి కాంబినేషన్ పైన కూడా అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరో అయిపోయాడు. బోయపాటి సినిమాలన్నీ కూడా తెలుగు ప్రేక్షకులకు అభిరుచి కు దగ్గరగా ఉంటాయి. వీరి కాంబినేషన్ వర్కౌట్ అవుతున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఉంటుందా, లేకపోతే కేవలం తెలుగు మాత్రమే పరిమితమవుతుందా అనే క్లారిటీ రావాల్సి ఉంది.

అయితే బోయపాటి శ్రీను ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్లు తన మాటల్లోనే ఇటువైపు అల్లు అర్జున్ ప్రాజెక్ట్ తో పాటు అటువైపు బాలకృష్ణ ప్రాజెక్ట్ కూడా చేయబోతున్నాడు. అంటే ఒకవైపు ఇది ఉండాలి, మరోవైపు అది ఉండాలి అని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు