Boyapati With Nbk: బోయపాటి దర్శకత్వంలో మరోసారి బాలకృష్ణ ఇది కదా బర్త్ డే ట్రీట్ అంటే

Boyapati With Nbk: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ కాంబినేషన్స్ లో బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ ఒకటి. బోయపాటి శ్రీను ఎంతమందితో సినిమాలు చేసినా కూడా బాలకృష్ణతో సినిమా అంటేనే ఒక హై ఉంటుంది. ఎందుకంటే బాలకృష్ణని ఎలా చూపించాలో ఎలా చూపిస్తే ప్రేక్షకులు ఇష్టపడతారు అనేదాంట్లో పిహెచ్డి చేశాడు అనే విధంగా సినిమాను తెరకెక్కిస్తుంటాడు. భద్ర సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన బోయపాటి శ్రీను తన కెరీర్ లో ఎన్నో హిట్స్ సినిమాలు చేశాడు. అయితే బాలకృష్ణ తో చేసిన సినిమాలు మాత్రం మంచి పేరును తీసుకొచ్చాయి.

సింహా సినిమాతో మొదలైన కాంబినేషన్

ఆల్మోస్ట్ బాలకృష్ణ కెరియర్ ముగిసిపోతుంది అనుకున్న టైంలో శ్రీను దర్శకత్వంలో సింహా అనే సినిమాను చేశాడు బాలయ్య. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత బాలయ్య వరుస సినిమాలకు సైన్ చేసాడు. మరోవైపు బోయపాటి శ్రీను కూడా ఫుల్ బిజీ అయిపోయాడు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి లెజెండ్ అనే మరో సినిమా చేశారు. ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది. బాలకృష్ణను రెండు పాత్రలలో చూపించి బ్లాక్ బస్టర్ హిట్స్ను అందుకున్నాడు. రీసెంట్గా వచ్చిన అఖండ సినిమా గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బాలకృష్ణ నట విశ్వరూపాన్ని ఆ సినిమాలో బయటపెట్టాడు బోయపాటి. అలానే తమన్ అందించిన మ్యూజిక్ కూడా సినిమాకి మంచి ప్లస్ అయింది.

Akhanda

- Advertisement -

అఖండ స్ట్రాంగ్ కం బ్యాక్

బాలకృష్ణ వరుసగా సినిమాలు చేస్తున్న కూడా అవి బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అవుతూ వస్తున్నా. అయితే బాలకృష్ణకి అన్ స్టాపబుల్ అనే షో కూడా చాలా పెద్ద ప్లస్ అయింది. అంతకు ముందు బాలయ్య తీరు చాలామందికి నెగిటివ్ ఇంప్రెషన్ తీసుకొస్తే, ఈ షో మాత్రం బాలయ్య లోని అసలైన వ్యక్తిత్వాన్ని బయటపెట్టింది. వ్యక్తులతో మాట్లాడే విధానం. వాళ్లతో మాట్లాడే తీరు ఇవన్నీ కూడా బాలకృష్ణకి ఒక ప్రత్యేకమైన అభిమానాన్ని తీసుకొచ్చి పెట్టాయి. అదే అఖండ సినిమాకి కూడా ఒక రకంగా ప్లస్ అయిందని చెప్పొచ్చు.

మరోసారి అదే కాంబినేషన్

ప్రస్తుతం బాలకృష్ణ హిందూపూర్ నియోజకవర్గంలో మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన సంగతి తెలిసిందే. ఇది నందమూరి అభిమానుల్లో ఆనందాన్ని కలిగించే విషయం. అయితే నేడు నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా బోయపాటి శ్రీను తో చేయబోయే సినిమాను అనౌన్స్ చేసారు . ఈ సినిమాను 14 రీల్స్ సంస్థ నిర్మించనుంది. హ్యాట్రిక్ సూపర్ హిట్ వచ్చిన ఈ కాంబినేషన్లో 4వ సారి సినిమా రాబోతుండడంతో దీనిపై కూడా అంచనాలు తారస్థాయిలో చేరాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు