Boycott Double Ismart : బాయ్ కాట్ డబుల్ ఇస్మార్ట్… పూరీకి బీఆర్ఎస్ కార్యకర్తల వార్నింగ్

Boycott Double Ismart : గత కొన్నాళ్లుగా హిట్ కోసం తపిస్తున్న డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈసారి ఎలాగైనా డబుల్ ఇస్మార్ట్ మూవీతో సాలిడ్ కం బ్యాక్ ఇవ్వాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం ఏకంగా ఆయన కొత్త ట్రెండ్ ను ఫాలో అవ్వడానికి రెడీ అయ్యారు. కానీ అదే ఇప్పుడు పూరికి లేనిపోని చిక్కులను తెచ్చిపెట్టింది. డబుల్ ఇస్మార్ట్ మూవీలోని సెకండ్ సాంగ్ లో వాడిన డైలాగుల వల్ల కొంతమంది మనోభావాలు దెబ్బతిని బాయ్ కాట్ డబుల్ ఇస్మార్ట్ అంటున్నారు.

బాయ్ కాట్ డబుల్ ఇస్మార్ట్

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో డబుల్ ఇస్మార్ట్ అనే మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ డబుల్ ఇస్మార్ట్ కి సీక్వెల్ గా ఈ సినిమాను తీసుకొస్తున్నారు. డబుల్ ఇస్మార్ట్ మూవీని స్వయంగా పూరి జగన్నాథ్ ఛార్మితో కలిసి నిర్మిస్తుండడం విశేషం. ఈ సినిమాలో రామ్ సరసన హీరోయిన్ గా కావ్య థాపర్ నటిస్తోంది. కాగా ఈ మూవీని ఆగస్టులో రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇప్పటికే స్టెప్పా మార్ అనే ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మార్ ముంత చోడ్ చింతా అనే సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్ కు కూడా అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. అయితే పాట మధ్యలో కొన్ని పాపులర్ మీమ్స్ వాడడంతో ఈ సాంగ్ వైరల్ అయింది. అలాగే కొంతమంది మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. దీంతో బాయ్ కాట్ డబుల్ స్మార్ట్ అంటూ పూరిపై ఫైర్ అవుతున్నారు.

Double iSmart: Maar Muntha Chod Chinta promises mass vibes - Telugu News - IndiaGlitz.com

- Advertisement -

పూరి జగన్నాథ్ కు బిఆర్ఎస్ కార్యకర్తల వార్నింగ్..

మార్ ముంతా చోడ్ చింత సాంగ్ మధ్యలో ఏం చేద్దాం అంటావు మరి అని కేసిఆర్ చెప్పిన డైలాగ్ ఉండడంతో బిఆర్ఎస్ కార్యకర్తలు పూరి జగన్నాథ్ పై మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ ను అవమానించే విధంగా ఒక ఐటమ్ పాటలో ఆయన మాటలను పెట్టడం ఏంటంటూ విరుచుకుపడుతున్నారు. గతంలో కూడా ఇలాగే తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే విధంగా పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్ తో కలిసి కెమెరామెన్ గంగతో రాంబాబు అనే సినిమాను తీశారని గుర్తు చేస్తూ, తాజాగా మరోసారి డబుల్ ఇస్మార్ట్ మూవీలోని ఐటమ్ సాంగ్ మార్ ముంతా చోడ్ చింతాలో కేసీఆర్ మాటలను పెట్టి మరోసారి రెచ్చగొడుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ పాటల నుంచి కేసిఆర్ మాటలను తొలగించకపోతే పూరీ జగన్నాథ్ ఇంటిని ముట్టడిస్తామని, మూవీని తెలంగాణలో రిలీజ్ కాకుండా చేస్తామని టిఆర్ఎస్ మహిళా కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ వివాదంపై ఇప్పటిదాకా ఇటు పూరి జగన్నాథ్ గాని, అటు హీరో రామ్ పోతినేని గాని స్పందించలేదు. మరి ఈ వివాదానికి పూరి జగన్నాథ్ ఎలా ఎండ్ కార్డ్ వేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు