Brahmaji: బాలయ్యకు భారీ కౌంటర్ వేసిన బ్రహ్మాజీ..!

కొన్ని సందర్భాలలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కొంతమంది నటీనటులు చేసిన పని వల్ల చాలామంది సెలబ్రిటీలు ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి. అలా ఇటీవలే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య గెస్ట్ గా వచ్చి మాట్లాడడం జరిగింది.. అయితే స్టేజ్ మీద బాలకృష్ణ హీరోయిన్ అంజలిని నెట్టిన వీడియో పెను దుమారాన్ని రేపింది. దీనిపైన ఇప్పటికే చిత్ర బృందం క్లారిటీ ఇచ్చినప్పటికీ ఏదో ఒక సందర్భంలో బాలయ్యను ట్రోల్ చేస్తూ చాలామంది వైరల్ చేస్తూ ఉన్నారు. అటు హీరో విశ్వక్ సేన్, నిర్మాత నాగ వంశీ, అంజలి వంటి వారు కూడా క్లారిటీ ఇచ్చారు

బాలయ్యకు బ్రహ్మాజీ కౌంటర్..

Brahmaji: Brahmaji gave a huge counter to Balayya..!
Brahmaji: Brahmaji gave a huge counter to Balayya..!

అయినప్పటికీ కూడా సోషల్ మీడియాలో ఇప్పటికీ బాలకృష్ణ గురించి ట్రోల్ మాత్రం తగ్గడం లేదు. ఇప్పుడు తాజాగా ఈ ఘటన పైన నటుడు బ్రహ్మాజీ ఇన్ డైరెక్ట్ గా ఒక పోస్టును షేర్ చేసినట్లు తెలుస్తోంది. తన ట్విట్టర్ నుంచి బ్రహ్మాజీ ఇలా షేర్ చేస్తూ..”వాడు దొంగతనం చేశాడని చెబితే.. అవును అది తప్పే అని అనడం మానేసి.. మీవాడు దొంగ కాదా అంటున్నారు.. తప్పుకి మీనింగే మారిపోయింది.. తప్పు ఎవడు చేసినా తప్పే.. వాడు వీడు ఎవడైనా అంటూ బ్రహ్మాజీ ఒక పోస్టుని షేర్ చేశారు”.

బాలయ్య ఫ్యాన్స్ ఏమంటారో..

అయితే మొదట బ్రహ్మాజీ ఈ పోస్టు దేని గురించి చేశారు.. ఎందుకు రియాక్ట్ అయ్యారు అనే విషయం పైన అభిమానులకు అర్థం కాలేదు కానీ కొంతమంది నెటిజెన్స్ మాత్రం బ్రహ్మాజీ రియాక్ట్ అయ్యింది బాలయ్య ఘటన వల్లే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా మొన్న జరిగిన ఎలక్షన్ సమయంలో, గొడవల విషయంలో కూడా ఎమ్మెల్యేని టార్గెట్ చేశావు.. ఇప్పుడు బాలయ్య చేసింది తప్పు కాదా అంటూ పలువురు నేతలు బ్రహ్మాజీ కి అదిరిపోయే కౌంటర్లు వేయడంతో ఇలా ఈ ట్వీట్ కాస్తా వైరల్ గా మారింది.

- Advertisement -

బ్రహ్మాజీ నిజాయితీ విషయంలో నెంబర్ వన్…

సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా నిజాయితీగా ఉండే బ్రహ్మాజీ ఇలాంటి కామెంట్స్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి బ్రహ్మాజీ చేసిన ఈ కామెంట్స్ కు బాలయ్య అభిమానుల నుంచి ఏదైనా కౌంటర్లు ఎదురవుతాయేమో చూడాలి. మరి అసలు విషయం ఏంటన్నది బ్రహ్మాజీ క్లారిటీ ఇస్తారేమో చూడాలి మరి. ఇటీవల కాలంలో బ్రహ్మాజీ పలు చిత్రాలలో కమెడియన్ గా నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంటున్నారు.. ముఖ్యంగా తను వేసే పంచ్ డైలాగులకు సపరేటు ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉంది.

అనసూయ ఆంటీ వివాదంలో బ్రహ్మాజీ..

అంతేకాదు అప్పుడప్పుడు ఈయన చేసే పంచులు వివాదాలలో కూడా చిక్కుకుంటూ ఉంటారన్న విషయం తెలిసిందే.. ఇక మొన్నా మధ్య అనసూయ ఆంటీ వివాదంలో కూడా బ్రహ్మాజీ చిక్కుకున్నారు. గతంలో ఒక విషయంలో అనసూయను ఆంటీ ఆంటీ అంటూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయిన విషయం తెలిసిందే ..దీనిపై అనసూయ స్పందిస్తూ ఆంటీ అంటే పోలీస్ కేసు పెడతా అంటూ హెచ్చరించింది కూడా.. ఇదే విషయంపై బ్రహ్మాజీ కూడా ఏమిటి అంటూ మధ్యలో దూరడంతో.. కొంతమంది నెటిజెన్లు ఏం లేదు అంకుల్ అంటూ కామెంట్ లు చేశారు.. దీంతో అంకుల్ ఏంట్రా అంకుల్ పోలీస్ కేస్ పెడతా అంటూ మరొకసారి అనసూయకు కౌంటర్గా కామెంట్ చేశారు.. ఇలా అప్పుడప్పుడు చేసే కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు