Brahmanandam: అమ్మాయి కనిపిస్తే చాలు.. బ్రహ్మానందం గుట్టు విప్పిన ప్రముఖ నటి..!

Brahmanandam: ఈ మధ్యకాలంలో చాలామంది నటీమణులు ఇండస్ట్రీలో ఉండే మేల్ యాక్టర్స్ తో , డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ తో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని.. అందులోనూ ప్రత్యేకించి కొంతమంది వల్ల మరింత సమస్యలు అధిగమవుతున్నాయి అంటూ.. తమను ఎవరైతే బాధపెడుతున్నారో వారి పేర్లను బహిర్గతం చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం కూడా ఒకరిద్దరు అమ్మాయిలను ఇబ్బంది పెట్టారని.. వారే స్వయంగా మీడియా ముందుకు వచ్చి చెప్పడం గమనార్హం. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హాస్యబ్రహ్మ గా గుర్తింపు తెచ్చుకున్న బ్రహ్మానందం తన అద్భుతమైన నటనతో కామెడీ పర్ఫామెన్స్ తో యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈయనపై ప్రముఖ నటి హేమాతో పాటు రమ్యశ్రీ చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

Brahmanandam: It's enough to see a girl.He also same..!
Brahmanandam: It’s enough to see a girl.He also same..!

ఇండస్ట్రీలో సమస్యలతో రమ్యశ్రీ కామెంట్స్..

చాలామంది హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను అలరించాలని అనుకుంటూ ఉంటారు.. అందుకే వ్యాంప్ తరహా పాత్రలలో నటించే వారి సంఖ్య చాలా తక్కువ..అలా ఎవరైనా ఉన్నప్పటికీ ఎన్నో సవాళ్లు ఎదుర్కొని నిలబడగలగాలి. అలాంటి వారిలో ప్రముఖ నటి రమ్యశ్రీ కూడా ఒకరు.. ఎన్నో చిత్రాలలో వ్యాంప్ క్యారెక్టర్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటికీ అడపాదడపా అవకాశాలు అందుకుంటూ ముందుకు పోతున్న రమ్యశ్రీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తాను ఇండస్ట్రీలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి వెల్లడించింది.

హేమతోపాటు నన్ను కూడా..

రమ్య శ్రీ మాట్లాడుతూ.. నేను ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లతో పనిచేశాను.. తెలుగులో బ్రహ్మానందం వంటి టాప్ కమెడియన్ నుంచి సుమన్ శెట్టి వరకు అందరితో కూడా పనిచేశాను.. అయితే ఎవరితో కూడా మాట్లాడటం కానీ ,గ్రూపుగా కూర్చుని సమస్యలు చెప్పుకోవడం కానీ లాంటివి అసలు చేసేదాన్ని కాదు.. దీంతో బ్రహ్మానందం తరచూ నన్ను అడిగే వారు.. ఏ అమ్మాయి ఇలా రా .. సరదాగా బయటకు వెళ్లొద్దాం.. ఎంతసేపు రూమ్ లోనే ఏముంటావు అంటూ అనేవారు. కానీ నేను వెళ్లకుండా ఏదో ఒకటి చెప్పి తప్పించుకునేదాన్ని.. రెండు మూడు రోజులు చూశాక వాళ్లే నన్ను పిలవడం మానేసేవారు.

- Advertisement -

బ్రహ్మానందం మాత్రమే కాదు బాబు మోహన్ కూడా..

అయితే హేమాని బ్రహ్మానందం ఇబ్బంది పెట్టారు అని నేను విన్నాను. ఆ తర్వాత బ్రహ్మానందం కూడా నా విషయంలో అలాగే ప్రవర్తించారు అంటూ హాట్ బాంబ్ పేల్చింది రమ్యశ్రీ .. అలాగే బాబు మోహన్ కూడా అదే విధంగా నన్ను ఇబ్బంది పెట్టారు అంటూ తెలిపింది రమ్యశ్రీ.. వారు అమ్మాయిలతో అలా అసభ్యకరంగా ప్రవర్తించడమే కాదు.. ఇగో కూడా చూపించేవారు. ఆ అమ్మాయి ఉంటేనే సినిమా చూస్తారా? మమ్మల్ని చూడరా? అంటూ అందరి ముందు చిన్నచూపు చూశారు అంటూ రమ్య తెలిపింది.

విదేశాల నుంచి డాక్టర్లు..

ఇకపోతే జీవితంలో కొన్ని విలువలను పాటిస్తాను. ఏం జరిగినా వాటిని అతిక్రమించను. అందుకే ఇప్పటివరకు నేను ఎవరితోనో తిరుగుతున్నట్లు, ఎఫైర్ పెట్టుకున్నట్లు రూమర్స్ నాపై రాలేదు. ప్యారిస్, లండన్, అమెరికాలో పనిచేసే పెద్ద పెద్ద తెలుగు డాక్టర్లు కూడా నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నారు. నాకు ప్రపోజ్ చేశారు. కానీ నేను వెళ్లలేదు అంటూ తెలిపింది. రమ్యశ్రీ ప్రస్తుతం బ్రహ్మానందం పై చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు