Brahmandam: కులాంతర వివాహం.. పైగా సినిమాని తలపించే ట్విస్ట్ లెన్నో..!

Brahmandam: తెలుగు సినీ పరిశ్రమలో హాస్యబ్రహ్మగా గుర్తింపు తెచ్చుకున్న బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నవ్వుల రారాజుగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన తాజాగా “నేను మీ బ్రహ్మానందం” అనే పేరుతో పుస్తకాన్ని రచించారు. దానిని తాజాగా చిరంజీవి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఇక ఈ పుస్తకంలో భాగంగా ఆయన పుట్టినప్పటి నుంచి తన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులను.. తన పెళ్లి, పిల్లలు సినిమా ఇండస్ట్రీలోకి రావడం ఇలా అన్ని విషయాల గురించి రాశారు. సినిమాలలోకి రాకముందు తెలుగు లెక్చరర్ గా పనిచేయడంతో ఈయనకు ఈ పుస్తకం రాయడం మరింత సులభంగా మారింది. ఇలా బ్రహ్మానందం తన ఆత్మ కథను తానే రాసుకున్నారు.

ఇక ఆ పుస్తకంలో తన పెళ్లికి సంబంధించిన విషయాలు కూడా ఎన్నో ఉన్నాయి. వాటి విషయానికొస్తే.. ఎంతో కష్టపడి చదివి లెక్చరర్ గా మారి పనిచేస్తున్న సమయంలో కుటుంబ సభ్యులు ఈయనకు పెళ్లి చేయాలని పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారట. ఆ సమయంలో బ్రహ్మానందం చదువు కోసం సహాయపడిన ఒక ఆవిడ.. తనకు తన భార్య లక్ష్మి సంబంధాన్ని తీసుకొచ్చారట. మరోవైపు బ్రహ్మానందం తల్లిదండ్రులు కట్నం కోసం బాగా ఎదురు చూశారు. అయితే బ్రహ్మానందం మాత్రం తాను ఈ స్థాయిలో ఉండడానికి సహాయపడిన మహిళ తీసుకువచ్చిన సంబంధం చేసుకోవాలని ఫిక్స్ అయ్యారట. ఈ విషయం కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అని వారు ఒప్పుకోలేదు. పైగా బ్రహ్మానందం కుటుంబ సభ్యులు బ్రాహ్మణులు.. లక్ష్మీ కుటుంబ సభ్యులు కాపులు కావడంతో ఈ పెళ్లికి వారు ఒప్పుకోలేదు.

కానీ బ్రహ్మానందం తన తల్లిదండ్రులతో గొడవపడి వారిని ఒప్పించి మరీ కులాంతర వివాహం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చేసుకున్నారట. ఇక ఇలా ఎప్పుడో తనకు సహాయపడిన ఆమెను గుర్తుపెట్టుకొని మరీ.. ఆమె తెచ్చిన సంబంధాన్ని చేసుకోవడానికి కన్న తల్లిదండ్రులతో కూడా గొడవపడి కులాంతర వివాహాన్ని చేసుకున్నారు బ్రహ్మానందం. ఇక ఈ విషయాలన్నీ కూడా తాను రాసిన పుస్తకం లో ఉండడంతో ఈ విషయాలు కాస్త వైరల్ గా మారుతున్నాయి. ఇది చదివిన అందరూ బ్రహ్మానందం ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారా? పెళ్లి కోసం ఇంత గొడవ పడ్డారా? ఇదంతా ఒక సినిమాను తలపిస్తోంది.. అప్పట్లోనే ఇన్ని ట్విస్ట్ లా అంటూ అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు