Brahmāstra: బాలీవుడ్ కి భరోస

చాలా కాలం తర్వాత బాలీవుడ్‌లో ఓ మెలకువ వచ్చింది. రణబీర్ కపూర్ నటించిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమా విజయంతో బాలీవుడ్‌కి ప్రాణం పోసింది. ఈ మధ్య కాలంలో ఎన్నో భారీ బడ్జెట్ చిత్రాలు పరాజయం పాలవడంతో బాలీవుడ్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. ఇప్పుడు ‘బ్రహ్మాస్త్ర’ పది రోజుల్లోనే భారీ కలెక్షన్లు రాబట్టి విమర్శలకు సమాధానమిస్తోంది.

ఇప్పటివరకు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ‘బ్రహ్మాస్త్ర’ 207.90 కోట్లు వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా పది రోజుల్లో రూ.360 కోట్లు వసూలు చేసింది. 2022లో బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘బ్రహ్మాస్త్ర’ నిలిచింది.

అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అలియా భట్ ‘ఇషా’ ప్రధాన పాత్రలో నటించింది. ‘బ్రహ్మాస్త్ర’ తెలుగు ట్రైలర్‌కి చిరంజీవి వాయిస్‌ని అందించారు. ‘బ్రహ్మాస్త్ర’ హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది. భారీ అంచనాలున్న ‘బ్రహ్మాస్త్ర’ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 75 కోట్లు వసూలు చేసింది.

- Advertisement -

ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విభజించారు, మొదటి భాగానికి ‘బ్రహ్మాస్త్రా పార్ట్ వన్: శివ’ అని పేరు పెట్టారు. ఈ చిత్రంలో అమితాబ్ , కింగ్ నాగార్జునలతో పాటు అతిధి పాత్రలో షారుఖ్ ఖాన్ నటనకు మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంలో మౌని రాయ్, డింపుల్ కపాడియా మరియు సౌరవ్ గుర్జార్ కూడా నటించారు. ఈ సినిమా మొత్తం బడ్జెట్ 410 కోట్లు అని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు