Mohanlal : బ్రేకింగ్ న్యూస్.. ఆసుపత్రిలో చేరిన స్టార్ హీరో..

Mohanlal : మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈయన తాజాగా ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ఆయనను కొచ్చిలోని అమృత ఆసుపత్రిలో చేర్చారు. ఈ విషయాన్ని ఆసుపత్రి అధికారులే స్వయంగా వెల్లడించారు.. ఆయనకు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

మోహన్ లాల్ కు తీవ్రంగా జ్వరం రావడంతో ఆరోగ్యం సరిగ్గా లేదని తెలుస్తుంది. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడమే కాకుండా పూర్తిగా కోలుకునే వరకు 5 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. రద్దీ ప్రదేశాలతోపాటు షూటింగ్స్ కు కొన్నిరోజులపాటు దూరంగా ఉండాలని మెడికల్ బులెటిన్ చెబుతోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని, ఆయన నెమ్మదిగా కోలుకుంటున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Breaking news.. Star hero admitted to hospital..Mohanlal: Breaking ne
Breaking news.. Star hero admitted to hospital..
Mohanlal: Breaking ne

మోహన్ లాల్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. మరోవైపు మోహన్‌లాల్‌ ఆసుపత్రిలో చేరడంపై పలు వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఇక సినిమాల విషయానికొస్తే.. ఈయన ఎంపురాన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి స్వయంగా దర్శకత్వం వహించగా.. బరోసిన్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను పూర్తి చేసి కొచ్చికి తిరిగి వచ్చిన తర్వాత ఆయనకు జ్వరం వచ్చినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈయన ప్రస్తుతం కోలుకుంటున్నారు. త్వరలోనే దీనిపై పూర్తి సమాచారం తెలియనుంది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు