Buchchibabu: బాలయ్య గురించి అంత సింపుల్ గా తేల్చేసావు ఏంటి బుచ్చి.?

Buchchibabu: ఉప్పెన సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు బుచ్చిబాబు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. మొదటి సినిమాతోనే దాదాపు 100 కోట్లు మార్కెట్లోకి చేరిపోయాడు బుచ్చిబాబు. ప్రస్తుతం బుచ్చిబాబు రామ్ చరణ్ తేజ్ తో ఒక సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఉత్తరాంధ్ర బాక్డ్రాప్ లో జరగనుంది. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి.

ఇక ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి 50 సంవత్సరాలను పూర్తి చేసుకున్నారు నందమూరి బాలకృష్ణ. ఈ తరుణంలో ఒక ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కు అతిరథ మహారధులు అందరూ హాజరయ్యారు. వాళ్లతో పాటు చాలామంది యంగ్ ఫిలిం మేకర్స్, అలానే చాలామంది దర్శక నిర్మాతలు కూడా హాజరయ్యారు. ఈ ఫంక్షన్ కి బుచ్చిబాబు కూడా వచ్చారు. అయితే అందరూ బాలయ్య గురించి చాలా గొప్పగా ఎన్నో రకమైన విషయాలను చెబుతూ వచ్చారు.

ఇ తరుణంలో బుచ్చిబాబు కూడా బాలయ్య గురించి మాట్లాడారు. బుచ్చిబాబు మాట్లాడుతూ ఈరోజు ఇంతకంటే గొప్ప మాట మంచి మాట మరొకటి ఉండదు అంటూ జై బాలయ్య అని చెప్పారు. అయితే బుచ్చిబాబు తక్కువ మాట్లాడినా కూడా చాలా ఇంపాక్ట్ ఫుల్ గా మాట్లాడాడు అని చెప్పొచ్చు. ఎందుకంటే జై బాలయ్య అనేది కేవలం ఒక పదం కాదు అది ఒక ఎమోషన్. అందుకే ఎక్కడపడితే అక్కడ సంబంధం లేకుండా కూడా చాలామంది జై బాలయ్య అంటూ అరుస్తూ ఉంటారు. అందుకని బుచ్చిబాబు కూడా తనదైన శైలిలో జై బాలయ్య అంటూ స్పీచ్ ముగించేసారు. దీనికి కొందరు ప్రతిస్పందిస్తూ బాలయ్య గురించి అంత సింపుల్ గా తేల్చేసావు ఏంటి బుచ్చి అంటూ అభిప్రాయ పడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు