Buchi Babu : రామ్ చరణ్ దర్శకుడు ఇంట విషాదం

 

Buchi Babu: తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే చాలామంది ప్రముఖ నటీనటులు… స్వర్గస్తులయ్యారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు తండ్రి పెద్దకాపు మరణించారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బుచ్చిబాబు తండ్రి… ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారట. కాకినాడ ఆస్పత్రిలో మరణించినట్లు సమాచారం అందుతోంది.

director Buchi Babu father died

దీంతో హుటాహుటిన ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు ఇంటికి సుకుమార్ కూడా వెళ్లారు. ఈ సందర్భంగా బుచ్చిబాబు తండ్రికి నివాళులర్పించారు దర్శకుడు సుకుమార్. ఇక ఇవాళ కాకినాడ జిల్లా కొత్తపల్లిలో దర్శకుడు బుచ్చిబాబు తండ్రి అంతక్రియలు జరగనున్నాయి. ఇక అటు ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబును సినీ ప్రముఖులు ఓదార్చుతున్నారు. ఇది ఇలా ఉండగా… ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు… ప్రస్తుతం రామ్ చరణ్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

- Advertisement -

Rc 16 పేరుతో వస్తున్న రామ్ చరణ్ మూవీకి… బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ఇంకా ఫిక్స్ కాలేదు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ జాన్వి కపూర్ హీరోయిన్గా నటించబోతున్నారు. శివ రాజ్ కుమార్, విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలు చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కాంబినేషన్లో ఈ సినిమా వస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు