RC16 : బుచ్చిబాబు నుండి సాలిడ్ అప్డేట్.. అప్పుడే పనులు మొదలు..

RC16 : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ ఎట్టకేలకు పూర్తయిందన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ కి సంబంధించి అన్ని సీన్లు కూడా పూర్తయిపోగా, చరణ్ లేని పది రోజుల షూట్ మాత్రమే బాకీ ఉంది. ఇక చరణ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్రీ అయ్యాడని చెప్పొచ్చు. ఇక తదుపరి సినిమాను బుచ్చిబాబు తో మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఆల్రెడీ మూవీ ప్రారంభోత్సవం కూడా రెండు నెలల కింద గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ ని ఆగష్టు లో స్టార్ట్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఇకపోతే గేమ్ ఛేంజర్ పూర్తయ్యాక ప్రస్తుతం రిలాక్స్ మోడ్ లో ఉన్నాడు చరణ్. తొందర్లోనే RC16 సెట్స్ లో అడుగుపెట్టనున్నాడు. అయితే బుచ్చిబాబు మాత్రం తన సినిమాకి సంబంధించి పనులు అప్పుడే మొదలుపెట్టేశాడు.

Buchibabu gave a solid update about RC16

సాలిడ్ అప్డేట్ ఇచ్చిన బుచ్చి..

ఇక బుచ్చిబాబు చరణ్ సినిమా కోసం చాలా రోజుల నుండే స్క్రిప్ట్ డెవలప్మెంట్ పనులు చేయగా, త్వరలోనే షూటింగ్ ని స్టార్ట్ చేయనున్నాడు. ఇక చరణ్ గేమ్ ఛేంజర్ సెట్స్ లో బిజీగా ఉన్నా, బుచ్చి మాత్రం షూటింగ్ కి సంబంధించిన పనులు ముందే మొదలు పెట్టాడు. ఇప్పటికే ఈ సినిమా కోసం చరణ్ ఇంటికి దగ్గరి ఏరియాలోని ఒక భారీ విలేజ్ సెట్ వేసారు. ఇక లేటెస్ట్ గా ఒక సాలిడ్ అప్డేట్ షేర్ చేసాడు బుచ్చిబాబు. RC16 కి ఏఆర్ రహమాన్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా కోసం డైరెక్టర్ బుచ్చిబాబు అప్పుడే రహమాన్ తో మ్యూజిక్ సిట్టింగ్ వేసాడు. అలాగే తనతో పాటు రత్నవేలు కూడా ఉన్న పిక్ ని షేర్ చేసాడు బుచ్చిబాబు. ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

- Advertisement -

రెగ్యులర్ షూట్ కి అన్నీ రెడీ..

ఇక టాలీవుడ్ లో తెరకెక్కబోయే మోస్ట్ అవైటెడ్ క్రేజీ చిత్రాల్లో RC16 ఒకటి కాగా, పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఆగస్టు రెండో వారం లో మొదలు పెడుతున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ప్రత్యేకపాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మెజార్టీ సన్నివేశాలు మరియు పాటలు కూడా విలేజ్ లోనే షూట్‌ చేస్తారని సమాచారం. వచ్చే ఏడాది దసరా లేదా దీపావళి సీజన్‌ లో RC16 ని మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. స్పోర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఒక బయోపిక్ ఆధారంగా తెరకెక్కుతోందని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు