RC16 : అవార్డు విన్నింగ్ పెర్ఫార్మన్స్ రేంజ్ లో బుచ్చిబాబు ప్లానింగ్! ఈ సారి టార్గెట్ అదే!

RC16 : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ తో గేమ్ చేంజర్ సినిమాతో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ ముగింపు దశలోనే ఉన్నా, శంకర్ ఇండియన్2 పై ఫోకస్ పెట్టడంతో రామ్ చరణ్ ఇక వేరే సినిమాని ముందు మొదలుపెడదామని చూస్తున్నాడు. అందరికీ తెలిసినట్టు ఈ సినిమా పూర్తి కాగానే ఉప్పెన డైరెక్టర్ బుచ్చి బాబు సాన డైరెక్షన్లో చరణ్ సినిమా చేస్తాడని తెలిసిందే. ఇక రెండేళ్ల కిందటే ఫిక్స్ అయిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఫైనల్ గా జూన్ లో మొదలు పెట్టనున్నారని సమాచారం. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కథతో ఈ సినిమా రాబోతుందని ఇదివరకే వార్తలు వచ్చాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వి కపూర్ చేస్తుండగా మ్యూజిక్ డైరెక్టర్ గా ఏ.ఆర్.రెహమాన్ ని ఫిక్స్ చేశారు. అయితే ఫస్ట్ మూవీ ఉప్పెన తోనే సెన్సేషనల్ హిట్ అందుకున్న బుచ్చి బాబు చరణ్ (RC16) తో చేసే సినిమాతో కూడా భారీ టార్గెట్ పెట్టుకున్నాడని సమాచారం. ఈ సినిమా కథ కథనాలు మెగా ఫ్యాన్స్ కు మాత్రమే కాదు కామన్ ఆడియన్స్ కు తెగ నచ్చేస్తాయని అంటున్నారు.

Buchibabu says Ram Charan will give an award winning performance in RC16

చరణ్ క్యారెక్టర్ పై స్పెషల్ ఫోకస్..

ఇక బుచ్చిబాబు ఈ సినిమాలో అందరికంటే ముందు రామ్ చరణ్ పాత్రపైనే ఫుల్ గా ఫోకస్ పెట్టాడని, రంగస్థలం షూటింగ్ లో స్వయంగా చరణ్ నటనా ప్రావీణ్యాన్ని చూసిన బుచ్చిబాబు, ఈ సినిమాలో అంతకు మించి పెర్ఫార్మన్స్ ని పిండుకోవడానికి రెడీ అయ్యాడట. ఈ సినిమాలో చరణ్ పర్ఫార్మెన్స్ ఒక రేంజ్ లో ఉంటుందని, చరణ్ క్యారెక్టరైజేషన్ కోసం బుచ్చి బాబు స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో చరణ్ మరోసారి తన పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేస్తాడని అంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే చరణ్ అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేస్తాడని చెబుతున్నారు. ఈ సినిమాతో చరణ్ కి నేషనల్ అవార్డు వచ్చే రేంజ్ లో సినిమా ఉంటుందని అంటున్నారు. బుచ్చి బాబు ఈ సినిమాను కేవలం పాన్ ఇండియా ఆడియన్స్ మాత్రమే కాదు ఇంటర్నేషనల్ లెవెల్ లో ఆడియన్స్ అందరినీ మెప్పించేలా ప్లాన్ చేస్తున్నారట.

- Advertisement -

మెగాభిమానుల్లో భారీ అంచనాలు..

ఇక అప్పుడప్పుడూ బుచ్చిబాబు ఈ సినిమా గురించి చెప్పే విషయాలు చరణ్ అభిమానులకు గూస్బంప్స్ పుట్టిస్తున్నాయి. ఇకస్క్రిప్ట్ దశలోనే ఈ సినిమాపై పాజిటివ్ రిపోర్ట్ రాగా, సినిమా సెట్స్ మీదకు వెళ్లాక మరింత బజ్ పెంచేస్తుందని అంటున్నారు. పీరియాడికల్ కథతో బుచ్చి బాబు ఈసారి మెగా ఫ్యాన్స్ అందరికీ ఫుల్ ట్రీట్ అందించేందుకు సిద్ధమవుతున్నాడు. అతి త్వరలో గేమ్ చేంజర్ ను ముగించిన వెంటనే చరణ్ ఈ సినిమాను స్టార్ట్ చేయనున్నాడు. రామ్ చరణ్ 16వ సినిమాగా వస్తున్న ఈ సినిమా చరణ్ రేంజ్ ఏంటన్నది మరోసారి చూపిస్తుందని ట్రేడ్ విశ్లేషకులు కూడా అంటున్నారు. మైత్రి ప్రొడక్షన్స్ ఈ సినిమా బడ్జెట్ విషయంలో కూడా నో లిమిట్స్ అనేస్తున్నారట. మొత్తానికి RC16 విషయంలో వస్తున్న వార్తలన్నీ మెగా ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నాయి. మరి బుచ్చి బాబు చరణ్ సినిమాను ఎలా తెరకెక్కిస్తాడన్నది చూడాలి. ఇక ఈ సినిమాతో చాలా రోజుల తర్వాత రెహమాన్ తెలుగులో చేస్తుండగా, ఇప్పటికే మూడు పాటలు కూడా సిద్ధం చేయడం విశేషం. మరి RC16 రెగ్యులర్ షూట్ ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు