Bujji And Bhairava : యానిమేటెడ్ సిరీస్ లో బెంగాలీ నటుడి బాహుబలి లాంటి విగ్రహం గమనించారా? కల్కిలో ఆయన పాత్ర ఏంటంటే?

Bujji And Bhairava : మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ కల్కి 2898 ఏడీలో నటించనున్న మెయిన్ స్టార్ట్స్ ను మాత్రమే ఇప్పటిదాకా అందరికీ తెలుసు. అయితే ఈ పాన్ వరల్డ్ సినిమాలో ఇంకెంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే కల్కి మూవీ థియేటర్లలోకి రావడానికంటే ముందే రిలీజ్ చేసిన యానిమేటెడ్ సిరీస్ బుజ్జి అండ్ భైరవలో ఓ సీనియర్ బెంగాలీ నటుడి పాత్రను కనిపెట్టారు నెటిజన్లు. మరి ఇంతకీ ఈ నటుడు ఎవరు? ఆయన పాత్ర? ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బుజ్జి అండ్ భైరవలో శాశ్వత ఛటర్జీ

చాలా మందికి ఇప్పటికే తెలిసి ఉండవచ్చు. బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ చిత్రంతో తెలుగు అరంగేట్రం చేయబోతున్నారు. ఇప్పుడు చిత్రం యానిమేటెడ్ ప్రిల్యూడ్ లో అతని పాత్రను పరిచయం చేశారు మేకర్స్. అందులో శాశ్వత ఛటర్జీ తన చేతిని పైకెత్తి, డిస్టోపియన్ నగర ప్రజల ప్రభువుగా ఉన్న భారీ యానిమేటెడ్ విగ్రహాన్ని చూడవచ్చు. అంటే బాహుబలిలో భళ్లాల దేవ విగ్రహం ఉన్నంత పెద్దగా ఆయన విగ్రహం ఉన్నట్టు కన్పిస్తోంది. ఒకవేళ ఇప్పటిదాకా యానిమేటెడ్ సిరీస్ లో ఆయనను గమనించకపోతే మరోసారి ఆ సిరీస్ పై లుక్కేయండి.

Image

- Advertisement -

శాశ్వత ఛటర్జీ పాత్ర ఇదేనా?

యానిమేటెడ్ సిరీస్ లోని సెటప్, రూపాన్ని బట్టి బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ ఈ చిత్రంలో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రను పోషించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే మేకర్స్ ఈ విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కాబట్టి కల్కి చిత్రం విడుదలైన తర్వాత మాత్రమే ఆయన పాత్ర ఎలా ఉండబోతోంది అనే విషయం తెలుస్తుంది.

అమెజాన్ లో యానిమేటెడ్ సిరీస్ స్ట్రీమింగగ్

బుజ్జి అండ్ భైరవ అనే యానిమేటెడ్ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతోంది. ప్రస్తుతానికి ఈ సిరీస్ నుంచి రెండు ఎపిసోడ్లు మాత్రమే రిలీజ్ చేశారు. వీరికి మంది రెస్పాన్స్ వస్తుండగా, మరో రెండు ఎపిసోడ్ లను జూన్ 27న కల్కి రిలీజ్ కు ముందు లేదా తరువాత స్ట్రీమింగ్ కానుందని అంటున్నారు.

కల్కి 2898 ఏడీ గురించి వెయిటింగ్

ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన కల్కి 2898 ఏడీ అనేది డిస్టోపియన్ ఫ్యూచర్ నేపథ్యంలో సాగే సైన్స్ ఫిక్షన్ మూవీ. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిందూ పురాణాల ఆధారంగా రూపొందింది. ఈ సినిమాలో భగవంతుడు విష్ణువు 10వ, చివరి అవతారం కల్కిగా ప్రభాస్ కన్పించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ భైరవ పాత్రలో కనిపిస్తాడు. అంతేకాకుండా ఈ చిత్రం కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ , దీపికా పదుకొణె, దిశా పటాని వంటి దిగ్గజ నటీనటులు నటిస్తున్నారు. ఇంకా చిత్రంలో భవిష్యత్ కారు బుజ్జి క్యారెక్టర్‌కి కీర్తి సురేష్ గాత్రదానం చేయడం విశేషం. మొత్తానికి ఈ మూవీ జూన్ 27 న థియేటర్లలోకి రాబోతోంది. ఈ మూవీ రిలీజ్ గురించి అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు