Bujji and Bhairava Release Date : బుజ్జి అండ్ భైరవ యానిమేటెడ్ సిరీస్ రిలీజ్ డేట్ ఇదే… బిగ్ సర్ప్రైజ్

Bujji and Bhairava Release Date : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ప్రభాస్ తాజా సైన్స్-ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడీ యానిమేటెడ్ సిరీస్ బుజ్జి  అండ్ భైరవ విడుదల తేదీని ప్రకటించారు. మరి ఈ సిరీస్ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది? అంటే..

మూవీ కంటే ముందే యానిమేటెడ్ సిరీస్

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 ఏడీ 2024లో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రాలలో ఒకటి. ఈ చిత్రం ఈ ఏడాది జూన్ 27న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే మూవీ ప్రమోషన్స్ ను విభిన్నంగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగానే మూవీ రిలీజ్ కంటే ముందే అందులో ప్రధాన పాత్రాలైన బుజ్జి, భైరవలతో ఒక యానిమేటెడ్ సిరీస్ ను రిలీజ్ చేయనున్నారు.

బుజ్జి అండ్ భైరవ రిలీజ్ డేట్

ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన చిత్ర ప్రచార కార్యక్రమంలో నిర్మాతలు ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం నుండి ప్రభాస్ పాత్ర భైరవ వాహనం అయిన బుజ్జిని ఆవిష్కరించారు. తాజా అప్‌డేట్‌లో కల్కి 2898 ఏడీలో బుజ్జి అండ్ భైరవ అనే యానిమేటెడ్ ప్రిల్యూడ్ ఉందని, ఇది మే 31 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్‌ కాబోతోందని తాజాగా ప్రైమ్ వీడియో వెల్లడించింది. ఈ సిరీస్ కల్కి 2898 ఏడీ ప్రపంచాన్ని అభిమానులకు మూవీ కంటే ముందే పరిచయం చేయనుంది. ఈ మేరకు తాజా పోస్ట్ లో యానిమేటెడ్ సిరీస్ లో ఓ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఉందంటూ సస్పెన్స్ లో పెట్టేశారు.

- Advertisement -

Prabhas' Kalki 2898 AD animated prelude Bujji and Bhairava to release on  THIS date; new teaser promises something BIG | PINKVILLA

బుజ్జి స్పెషల్ స్టోరీ

ఇటీవల జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో కల్కి 2898 ఏడీ నిర్మాతలు బుజ్జి అనే ప్రభాస్ వాహనాన్ని ఆవిష్కరించారు. ఈ మూడు చక్రాల అధునాతన కారును కోయంబత్తూరులోని ఆటోమొబైల్ తయారీదారులు మహీంద్రా, జయం మోటార్స్ ఈ చిత్రం కోసం స్పెషల్ గా తయారు చేశారు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ భైరవ ఈ కారును నిర్మించారు. ఈ బుజ్జి అనే వాహనం 6 టన్నుల బరువు ఉందని, 94 Kw శక్తికి సమానమని తెలిసింది. ఇంకా ఈ వాహనం 47 KwH బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది.

అత్యంత ఖరీదైన పాన్ వరల్డ్ మూవీ

కల్కి 2898 ఏడీ చిత్రంలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటానీతో పాటు పలువురు ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మునుపటి ఇంటర్వ్యూలో దర్శకుడు నాగ్ అశ్విన్ కల్కి 2898 ఏడీ 6000 సంవత్సరాల కాలవ్యవధిని కలిగి ఉందని, మహాభారతం ముగిసిన 3102 BCE నుండి మొదలై, టైటిల్ సూచించినట్లుగా 2898 ఏడీ వరకు కొనసాగుతుందని వెల్లడించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సి అశ్వని దత్ ఈ చిత్రాన్ని దాదాపు 600 కోట్ల అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా, సంతోష్ నారాయణన్ సంగీతం సమకూరుస్తున్నారు. సెర్బియా సినిమాటోగ్రాఫర్ డ్జోర్జె స్టోజిల్జ్కోవిచ్ ఈ చిత్రానికి కెమెరా మ్యాన్ గా వర్క్ చేస్తున్నారు. కాగా కల్కి పాన్ వరల్డ్ మూవీగా రూపొందుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు