Bujji from Kalki 2898 AD : బుజ్జిలో కొత్తేముంది తెలుగులోనే చాలా చూశాం… ట్రోల్స్ మొదలయ్యాయి

Bujji from Kalki 2898 AD : అన్ని సినిమాలు అందరికీ నచ్చాలి అని రూలేమీ లేదు. కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు ఇష్టపడని ప్రేక్షకులు కూడా ఉంటారు. ఇకపోతే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎదురుచూస్తున్న సినిమా కల్కి. ఈ సినిమాకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. అలానే రీసెంట్ గా ఈ సినిమా నుంచి బుజ్జి అని ఒక వెహికల్ ని పరిచయం చేయడానికి ఒక ఈవెంట్ ను కండక్ట్ చేసింది చిత్ర యూనిట్. అయితే ఈ బుజ్జి అనే వెహికల్ అందర్నీ బాగా ఆకట్టుకుంది. దీని గురించి నాగ్ అశ్విన్ మాట్లాడుతూ కూడా బుజ్జి పేరు చిన్నదవచ్చు, కానీ సినిమాలో బుజ్జి చాలా కీలకమంటూ చెప్పుకొచ్చారు.

ఇలా చాలానే వచ్చాయి…

ఇకపోతే ఇది కేవలం సినిమా కోసమే ప్రత్యేకించి తయారు చేశారు. అయితే ఇది చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కానీ కొంతమంది మాత్రం ఇది పెద్ద విశేషమేమీ కాదు అంటూ ట్రోలింగ్ కూడా మొదలుపెట్టారు. కేవలం సినిమాల కోసం తయారు చేసినవి గతంలో చాలా ఉన్నాయి.

మహేష్ కోసం చేసిన ప్రత్యేక బైక్…

త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన సినిమా ఖలేజా. ఖలేజా సినిమాలో మహేష్ బాబు ఎంట్రీ కోసం ఎడారిలో గుర్రాలపైన వెళ్లేటట్లు ప్లాన్ చేశారట. అయితే అప్పటికే మగధీర సినిమా రావడంతో ఆ ప్లాన్ కాస్త పక్కనపెట్టి ఒక కొత్త బైక్ తీసుకొచ్చి, కేవలం సినిమా కోసమే దాన్ని పాడుచేసి, ఇసుక లోనుంచి ఆ బైక్ తీయడం మహేష్ బాబు దూసుకుంటూ వెళ్ళటం జరిగింది.

- Advertisement -

Maryada Ramanna

మర్యాద రామన్న సైకిల్…

ఎస్ఎస్ రాజమౌళి మగధీర సినిమా తర్వాత తీసిన సినిమా మర్యాద రామన్న. ఈ సినిమాలో సైకిల్ కి ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. దీనికి వాయిస్ ఓవర్ రవితేజ అందించారు. అయితే కేవలం ఈ సినిమా కోసమే ఆ సైకిల్ ని కూడా రెడీ చేశారు. ఈ సినిమాను వేలం పాటలో కూడా పెట్టారు ఆ సినిమా ఆడియో లాంచ్ లో.

Robot - Rajinikanth

చిట్టి ది రోబోట్…

శంకర్ దర్శకత్వంలో వచ్చిన రోబో సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలియంది కాదు. అయితే ఈ సినిమాలో రజనీకాంత్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో చిట్టి అనే పాత్రకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది. ఆ సినిమా కోసమే రోబో ను తయారు చేశారు.

ఇంక చాలా…

అలానే షారుక్ ఖాన్ నటించిన రావణ్ అనే సినిమాలో కూడా ఒక రోబో ని తయారు చేశారు. అమ్మో బొమ్మలో గంగారం అనే బొమ్మ, బామ్మ గారి మాట బంగారు బాట, కారా మజాకా అనే సినిమాల్లో కారులు కూడా సినిమాల్లో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి.

కల్కి భారీ బడ్జెట్ కాబట్టి

ఇలా తెలుగు సినిమాల్లో ఎన్నో వాటికి కావాల్సిన వస్తువులను తయారు చేసుకుంటూ వెళ్లారు. అయితే కల్కి పెద్ద బడ్జెట్ సినిమా కాబట్టి దీనికోసం హెవీ బడ్జెట్ పెట్టి ఈ వెహికల్ ను సిద్ధం చేశారు. దీంట్లో ఆశ్చర్యపోవడానికి ఏముంది.? అంటూ చాలామంది అంటున్నారు. ఈ సినిమాకి సంతోష్ నారాయన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. నాగ్ అశ్విన్ ఈ సినిమా కోసం దాదాపు గత ఐదేళ్లుగా కష్టపడుతూనే ఉన్నారు. ఈ సినిమాలో దీపికా పదుకొనే కమలహాసన్ అమితాబచ్చన్ వంటి ప్రముఖ నటులు కనిపిస్తున్నారు. అయితే మొదటి పార్ట్ లో కమల్ హాసన్ కేవలం 20 నిమిషాలు మాత్రమే ఈ సినిమాలో కనిపించనున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు