Harom Hara Tickets: హీరో సుధీర్ బాబు మోస్ట్ అవైటెడ్ మూవీ ” హరోం హర “. ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర మూవీస్ బ్యానర్ పై సుమంత్ జి నాయుడు గ్రాండ్‌గా నిర్మిస్తున్నాడు. ఇక ఈ యాక్షన్ మూవీ కి సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక డైరెక్షన్ వహించాడు.
ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్ అండ్ టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. జులై 14న ఈ మూవీ గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ టికెట్స్ విషయంలో బంపర్ ఆఫర్ ఇచ్చారు మేకర్స్. రెండు కొంటే ఒకటి ఫ్రీ అంటూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
#GoodChance pic.twitter.com/dRd2dCvHOb
— devipriya (@sairaaj44) June 13, 2024
విషయం ఏమిటంటే.. హర హర మూవీ రెండు టికెట్లు కొంటే ఒక టికెట్‌ని ఉచితంగా పొందవచ్చు. ఇది ఓన్లీ బుక్ మై షో లో బుక్ చేసుకునే వారికి మాత్రమే. తాజాగా ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ప్రజెంట్ ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ ఆఫర్ ని చూసిన సుదీర్ బాబు ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక మరికొంతమంది మాత్రం.. ఇటువంటి ఆఫర్ పెట్టకపోతే సుధీర్ బాబు సినిమా థియేటర్లలో ఆడదా? అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.