Bunny -Trivikram Movie : బన్నికి మరో నిరాశ తప్పదా.. త్రివిక్రమ్ కూడా ఇలా చేస్తాడని ఊహించలేదు

Bunny -Trivikram Movie : గత కొన్ని రోజుల నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో మూవీ రాబోతోందని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయంపై అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈ అధికారిక ప్రకటన వచ్చింది మేకర్స్ నుంచి కాదు అల్లు అర్జున్ సన్నిహితులు బన్నీ వాస్ నుంచి. కానీ ఆయన ఇచ్చిన అప్డేట్ తో అల్లు అభిమానులు అస్సలు సంతోషంగా లేరు. పైగా త్రివిక్రమ్ కూడా ఇలా చేస్తాడని ఊహించలేదు అంటూ నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ వీరిద్దరి కాంబో గురించి బన్నీ వాస్ ఇచ్చిన అప్డేట్ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…

బన్నీకి మరో నిరాశ తప్పదా ?

అల్లు అర్జున్ ఇప్పటికే దాదాపు మూడేళ్ల నుంచి పుష్ప 2 కోసమే టైం స్పెండ్ చేస్తూ వస్తున్నాడు. పుష్ప మూవీ 2021లో రిలీజ్ కాగా, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన నెక్స్ట్ మూవీ థియేటర్లలోకి రాలేదు. ఈ డిసెంబర్ 6న రిలీజ్ కాబోతున్న పుష్ప 2 మూవీ ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. ఈ నేపథ్యంలోనే మూవీ ఆగిపోయిందని, అల్లు అర్జున్ అందుకే గడ్డం తీసేసాడని పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇది చాలదన్నట్టు ఆయన నెక్స్ట్ మూవీ విషయంలో కూడా ఇలాగే సాగదీయబోతున్నట్టుగా తెలుస్తోంది.

చాలాకాలంగా బన్నీ నెక్స్ట్ మూవీ ఏంటి అనే విషయంపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత ఈ దర్శకుడితోనే సినిమా చేయబోతున్నాడు అంటూ పలువురు పేర్లు తెరపైకి వస్తున్నాయి. నిన్న మొన్నటిదాకా అట్లీ పేరు వినిపించగా, ఆయన మరో బాలీవుడ్ స్టార్ తో కమిట్ అయ్యారు. అయితే ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుంది అనే డౌట్ మొదలైంది. తాజాగా ఆయ్ మూవీ ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొన్న నిర్మాత బన్నీ వాస్ పుష్ప 2 మూవీపై వచ్చిన రూమర్లను కొట్టి పారేయడంతో పాటు త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ సినిమా గురించి కూడా క్లారిటీ ఇచ్చారు. కానీ ఆ అప్డేట్ ను విన్నాక బన్నీకి మరో నిరాశ తప్పదా? అన్పిస్తోంది.

- Advertisement -

Exclusive: Allu Arjun and Trivikram to team up for the fourth time -  JSWTV.TV

త్రివిక్రమ్ కూడా ఇలా చేస్తాడని ఊహించలేదు

బన్నీ – త్రివిక్రమ్ ప్రాజెక్ట్ అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందనుందని బన్నీ వాస్ గుడ్ న్యూస్ చెప్పారు. గత రెండేళ్ల నుంచి చర్చించుకుని ఒక కాన్సెప్ట్ కు ఫిక్స్ అయ్యారని, కానీ ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ కే  ఒకటిన్నర సంవత్సరాల టైం పడుతుందని, అలాగే ఫండ్స్ కలెక్ట్ చేయడానికి మరో ఏడాది పట్టొచ్చు అంటూ బాంబు పేల్చారు. అంటే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వంటి కార్యక్రమాలతో కలిపి ఎలా చూసుకున్నా ఈ మూవీ రిలీజ్ కావడానికి మరో నాలుగు ఏళ్ళు పడుతుందన్నమాట. ఇదే ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులను నిరాశ పరుస్తోంది. మరి ఇప్పటికే పుష్ప 2 కోసం మూడేళ్లు కేటాయించిన అల్లు అర్జున్.. త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కోసం మరో నాలుగు ఏళ్ళు వెయిట్ చేస్తారా? లేదా అంతలోపు వేరే మూవీని ఫినిష్ చేస్తారా? అనేది వెయిట్ అండ్ సీ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు