Bunny Vasu:మెగా ఫ్యామిలీ అయితే నాకేంటి… ఈ ప్రొడ్యూసర్ వెనుక ఉంది అతనేనా…?

Bunny Vasu.. ఎప్పుడైతే మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు అల్లు అర్జున్ టార్గెట్ చేస్తూ కామెంట్లు చేశారు ఇక అప్పటినుంచి రోజురోజుకి మెగా ఫ్యామిలీ వాల్యూ తగ్గిపోతూనే ఉంది. ఇప్పటివరకు ఎటువంటి విభేదాలు లేకుండా కలిసిమెలిసి ఉన్న మెగా – అల్లు ఫ్యామిలీల మధ్య ఒక్కసారిగా చీలికలు రావడం వల్లే ఇది జరుగుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా మెగా ఫ్యామిలీ అయినప్పటికీ కూడా భయపడేది లేదంటున్నారు ప్రముఖ నిర్మాత బన్నీ వాసు. అల్లు అరవింద్ ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉన్న ఈయన, ఇండస్ట్రీలో తనకంటూ ఒక బ్రాండ్ ని ఏర్పరచుకున్న విషయం తెలిసిందే. పైగా బన్నీ వాసు అల్లు అర్జున్ సపోర్టుతో నిర్మాతగా బాగానే నెట్టుకొస్తున్నారు. ముఖ్యంగా బన్నీ వాసు నిర్మించిన ఎన్నో చిత్రాలు కూడా మంచి విజయాలు అందుకున్నాయి. చిన్న హీరోలను ప్రోత్సహిస్తూ మంచి విజయాలను అందించిన ఘనత బన్నీ వాసు సొంతం.

Bunny Vasu: What about me if it's a mega family.. Is he the one behind this producer..?
Bunny Vasu: What about me if it’s a mega family.. Is he the one behind this producer..?

మెగా ఫ్యామిలీని లెక్క చేయని బన్నీ వాసు..

అల్లు కుటుంబం అండ ఉండడం వల్లే మెగా ఫ్యామిలీ అంటే ఐ డోంట్ కేర్ అన్నట్లుగా బన్నీ వాసు ప్రవర్తిస్తున్నారు అంటూ వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి. అయితే తాను నిర్మాతగా సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణం అల్లు కుటుంబం అని, ఆ కుటుంబాన్ని ఎవరైనా ఏదైనా అన్నారంటే అతనిలో అహం పెరిగిపోతుందనే విధంగా టాక్ వినిపిస్తోంది.. అలాగే గీతా ఆర్ట్స్-2 బ్యానర్ పై నిర్మించిన తాజా చిత్రం ఆయ్. ఈ చిత్రం ఈనెల 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదే రోజున హీరో రామ్ పోతినేని నటించిన డబుల్ ఇస్మార్ట్ శంకర్, రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాలతో పాటు మరికొన్ని చిత్రాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి.

అహం వెనుక ఉన్నది బన్నీయేనా..

పైగా ఆగస్టు 15న విడుదలవుతున్న చిత్రాలన్నీ కూడా భారీ బడ్జెట్ చిత్రాలే అయినప్పటికీ కూడా తమ సినిమా మీద నమ్మకం ఉందని, అందుకే ఆయ్ చిత్రాన్ని కూడా అప్పుడే విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట. అయితే ఇందులో హీరోగా నార్నే నితిన్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రెస్ మీట్ నిర్వహించారు బన్నీ వాసు. ఇదిలా ఉండగా గతంలో ఫిలిం ఛాంబర్ ఒక జర్నలిస్ట్ ని ప్రెస్ మీట్స్ కు రావద్దని చెప్పింది. కానీ బన్నీ వాసు కావాలనే ఆ కాంట్రవర్షియల్ జర్నలిస్టును ఇక్కడికి పిలిపించారు. అతని కోసం అవసరమైతే ఛాంబర్ ని కూడా లెక్క చేయను అంటూ రాష్ గా మాట్లాడారు .ఎందుకంటే ఈ జర్నలిస్టు గతంలో మెగా పిఆర్ఓ ని అంటూ గోవాలో ఒక ఈవెంట్ చేసి అక్కడికి వచ్చిన సౌత్ ఆర్టిస్టులు అందరినీ గాలికి వదిలేసి, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని హైదరాబాద్ వచ్చేసాడు. మెగా పిఆర్ఓ అన్న ట్యాగ్ ఉందని అలా చేయడంతో, అక్కడికి వెళ్లిన వాళ్లంతా చిరంజీవికి విషయం చెబితే , ఆయనతో పాటు మెగా హీరోలంతా ఆ జర్నలిస్టును దూరం పెట్టారు.

- Advertisement -

మెగా ఫాన్స్ దెబ్బకు బన్నీ వాసు పరిస్థితి ఏంటి..?

ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను కాదనుకొని,దూరం వెళ్ళిన అల్లు అర్జున్ తీరుపై అసహనంగా ఉన్నారు మెగా ఫాన్స్ . దీనికి తోడు బన్నీ వారికి మరింత కోపం తెచ్చేలా కేవలం అల్లు అర్జున్ మెప్పు కోసమే ప్రయత్నిస్తూ ఇండైరెక్టుగా మెగా ఫ్యామిలీతో నాకు పని ఏంటి అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు. అంతేకాదు ఇండస్ట్రీ అంతా ఈ విషయం ఓపెన్ గానే చెప్పుకుంటున్నారట. మరి ఈ విషయంపై మెగా ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు