Bunny Vasu: అంత రిస్క్ అవసరం అంటారండి ఆయ్

Bunny Vasu: మ్యాడ్ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమయ్యాడు నర్నే నితిన్. మొదటి సినిమాతోనే మంచి పేరు సాధించుకొని తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకొని ప్రయత్నాల్లో ఉన్నాడు. అయితే నీ నితిన్ ఎన్టీఆర్ కి స్వయానా బావమరిది అవుతాడు అనే సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం నితిన్ ఆయ్ ఒక సినిమాను చేస్తున్నాడు. సినిమా గోదావరి బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. ఈ సినిమా పైన కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. గీత ఆర్ట్స్ బ్యానర్ లో వస్తున్న సినిమా ఇది.

ఈ సినిమాకి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే బన్నీ వాసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ కి బన్నీ వాసుకి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. లేకపోతే గీత ఆర్ట్స్2 బ్యానర్ పై బన్నీ వాసు సినిమాలు నిర్మిస్తూ ఉంటారు. సక్సెస్ఫుల్ సినిమాలను కూడా ఆ బ్యానర్ పైన నిర్మించారు. కథల విషయంలో అలానే మార్కెట్ విషయంలో బన్నీ వాసు కొన్నిసార్లు చాలా తెలివిగా ఆలోచిస్తారు. అయితే ఇప్పుడు వస్తున్న చిక్కు అంతా ఆయ్ అనే చిన్న సినిమాను చాలా పెద్ద సినిమాల మధ్య రిలీజ్ చేయడమే.

Aay

- Advertisement -

ఒక హాలిడే దొరికితే చాలు చాలా తెలుగు సినిమాలు ఆరోజు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు నిర్మాతలు. ముందుగా ఆగస్టు 15 సందర్భంగా పుష్ప సినిమాను రిలీజ్ చేస్తామని అప్పట్లో ప్రకటించారు. సినిమా పెండింగ్ వరకు వలన అది కాస్త పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు ఆ డేట్ కి చాలా సినిమాలు వచ్చి పడ్డాయి. రవితేజ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న మిస్టర్ బచ్చన్. పూరి జగన్నాథ్ రామ్ కాంబినేషన్ లో వస్తున్న డబల్ ఇస్మార్ట్. అలానే చియాన్ విక్రమ్ తంగలాన్ సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. ఈ సినిమాల మీద మంచి అంచనాలు కూడా ఉన్నాయి. అయితే ఈ సినిమాల మధ్య కేవలం కంటెంట్ ను నమ్మి ఆయ్ అనే సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు బన్నీ వాసు తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు