Allu Arjun : 10 కోట్ల ఆఫర్ ను రిజెక్ట్ చేసిన బన్నీ..?

అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రాఘవేంద్రరావు తెరకెక్కించిన గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ వరుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో చేసిన ఆర్య సినిమాతో స్టైలిష్ స్టార్ అనే బిరుదును అందుకున్నాడు. తన అద్భుతమైన నటన, డ్యాన్స్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.

 

ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి ఎన్నో హిట్స్, ఫ్లాప్స్ ను తన ఖాతాలో వేసుకొని స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఇదిలా ఉండగా…పుష్ప సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియన్ స్టార్ హీరోగా ఎదిగిన విషయం తెలిసిందే. అప్పటినుంచి అల్లు అర్జున్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అల్లు అర్జున్ సినిమాల్లో నటించడమే కాకుండా పలు బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గాను వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Allu Arjun: Do you know the cost of the watch worn by Bunny?

అంతేకాకుండా పలు యాడ్ షోలలో కూడా నటిస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా… పుష్ప ది రూల్ సినిమా విడుదలైన తర్వాత అల్లు అర్జున్ కు పొగాకుకి సంబంధించిన యాడ్ చేయాలని ఆఫర్ వచ్చిందట. అందుకు సుమారు రూ. 10 కోట్లు ఆఫర్ చేశారట. కేవలం 60 సెకండ్ల వీడియోలో మాత్రమే అల్లు అర్జున్ ను నటించమని రిక్వెస్ట్ చేశారట. కానీ అల్లు అర్జున్ చాలా సున్నితంగా ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేశారని తెలుస్తోంది. అతి తక్కువ సమయంలో నటించినందుకు అన్ని కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చిన కూడా నటించినని చెప్పడంతో ఆ సంస్థకు సంబంధించిన వారంతా షాక్ అయ్యారట.

దానికి గల కారణం గురించి అడగ్గా….పొగాకు వంటి ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి నేను అసలు ఇష్టపడను. అలాంటి ప్రకటనలలో నటిస్తే నా అభిమానులకు, శ్రేయోభిలాషులకు నేను చెడుని వ్యాప్తిచేసినట్లు అవుతుంది. నా అభిమానులకు నేను ఎప్పుడూ చెడు వ్యసనాలకు అలవాటు చేయాలని అనుకోను అని చెప్పారట. అందుకు నాకు రూ. 10 కోట్లు కాదు. రూ. 100 కోట్లు ఇచ్చినా కూడా ఆ యాడ్ లో నటించనని ఖరాఖండిగా చెప్పేశారట. ఈ విషయం తెలిసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా అల్లు అర్జున్ క్యారెక్టర్ చాలా మంచిది అని అనుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు