Anushka – Virat Second Child : అనుష్క రెండవ బిడ్డకు ఎక్కడ జన్మనివ్వబోతోందో తెలుసా? 

సెలబ్రిటీ కపుల్ అనుష్క శర్మ, విరాట్ కోహ్లి ఈ మధ్య తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. గత కొన్ని రోజులుగా అనుష్క గర్భవతి అని, త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వనుందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. కానీ ఈ విషయం గురించి వీరిద్దరూ ఇప్పటిదాకా స్పందించలేదు. ఇదిలా ఉంటే విరాట్ కోహ్లి కొన్ని కుటుంబ కారణాల వల్ల టెస్టు మ్యాచ్ నుంచి తప్పుకుని ఇండియాకు తిరిగి వచ్చాడు. ఆ తర్వాత వీరిద్దరూ మళ్లీ తల్లిదండ్రులు కాబోతున్నారని మాజీ క్రికెటర్ విలియమ్స్ లీక్ చేసాడు. ఆ తరువాత ఏమైందో ఏమోగానీ తన స్నేహితుడి వ్యక్తిగత సమాచారాన్ని బయట పెట్టినందుకు సారీ చెప్పాడు. తాజాగా మరో వ్యక్తి అనుష్క రెండవ బిడ్డకు ఎక్కడ జన్మనివ్వబోతోంది అనే విషయంపై పెద్ద హింట్ ఇస్తూ పోస్ట్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

బిజినెస్ మాన్ హర్ష్ గోయెంకా ట్విట్టర్లో చేసిన పోస్ట్ మరోసారి విరాట్, అనుష్కల రెండవ బిడ్డ గురించి చర్చకు దారి తీసింది. ‘రెండో పాప త్వరలో పుట్టబోతోంది. ఈ పాప తన గొప్ప క్రికెటర్ తండ్రిలా క్రికెట్ ఆడుతూ భారతదేశ కీర్తిని కొత్త శిఖరాలకు తీసుకెళ్తాడా లేదా తన తల్లిని అనుసరించి సినిమా స్టార్ అవుతాడా?’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. అంతేకాదు ‘ఈ ఇండియన్ బేబీ లండన్‌లో పుట్టనుంది’ అంటూ ఓ హ్యాష్ ట్యాగ్ కూడా ఈ పోస్ట్ కు యాడ్ చేశాడు. అయితే ఆయన ఈ ట్వీట్ లో ఎవరి పేరునూ బయట పెట్టనప్పటికీ జనాలు మాత్రం విరుష్క దంపతుల గురించి ఈ హింట్ అని ఫిక్స్ అయిపోయారు. మొత్తానికి విరుష్క దంపతుల రెండవ బిడ్డ లండన్ లో పుట్టబోతోంది అన్నమాట.

వాస్తవానికి 2020లో విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో వచ్చిన అనుష్క ప్రెగ్నెన్సీ వార్తలను కొట్టిపారేశాడు. కానీ 2021 జనవరిలో అనుష్క తమ మొదటి కూతురు వామికా కోహ్లీకి జన్మనిచ్చింది. అయితే ఈ జంట ఇంకా అమ్మాయి ముఖాన్ని మీడియాకు చూపించలేదు. ఇద్దరూ తమ వ్యక్తిగత జీవితాన్ని చాలా గోప్యంగా ఉంచుకోవాలనుకుంటున్నారు. అందుకే రెండో బిడ్డ పుట్టబోతున్న విషయాన్ని దాచిపెట్టారు. కానీ వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఏదో ఒక విధంగా అనుష్క రెండవసారి ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి వార్తలు బయటకు వస్తూనే ఉన్నాయి. కాగా అనుష్క శర్మ సినిమాల విషయానికొస్తే… ఈ అమ్మడు నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘చక్దా ఎక్స్‌ప్రెస్’లో కనిపించనుంది. అనుష్క ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేయగా, త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈ మూవీ గురించి అనుష్క అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు