Kalki Free Tickets : అయ్యో..! ఇక కల్కి ముగిసినట్టేనా..? చివరికి బై వన్ గెట్ వన్ ఫ్రీ..

Kalki Free Tickets : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి జోరు తగ్గిపోయింది. అన్ని చోట్లా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కలెక్షన్ల జోరు నాలుగు వారాల పాటు ఉంటుందని అభిమానులు ఆశపడ్డారు. కానీ ఇప్పటికి ఓవర్సీస్ లో రికార్డు కల్లెక్షన్లు సాధిస్తున్న ఈ సినిమా కలెక్షన్లు ఇండియాలో తగ్గిపోయాయి. ఇప్పటికే వెయ్యి కోట్ల క్లబ్ లో చేరాల్సిన కల్కి అటు ఇటు గా ఊగిసలాడుతూనే ఉంది. దాదాపు ఆ మార్క్ కి 90 కోట్ల దూరంలో ఉందని చెప్పాలి. అయితే ప్రీమియర్స్ తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న కల్కి ప్రభంజనం సృష్టిస్తుందనుకోగా, ఆ మాటకి న్యాయం చేసినట్టే చేసి దెబ్బేస్తున్నాయి కలెక్షన్లు. ఇదిలా ఉండగా కల్కి కలెక్షన్లు పెంచడం కోసం మేకర్స్ మాత్రం గట్టి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

Buy One Get One Free Ticket Offers for Kalki2898AD Movie

 

- Advertisement -

బై వన్ గెట్ వన్ ఫ్రీ..

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి భారీ తారాగణం ఉండడంతో ఓ రేంజ్ హైప్ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద డీలా పడడం షాకింగ్ కి గురి చేస్తుంది. అయితే ఎలాగైనా వసూళ్లు పెంచాలని వెయ్యి కోట్ల మార్క్ ని అందుకోవాలని చిత్ర యూనిట్ సాలిడ్ ఆఫర్ ని ప్రేక్షకులకు అందుబాటులో పెట్టేస్తుంది. తాజాగా కల్కి చిత్ర యూనిట్ బై వన్ గెట్ వన్ ఆఫర్ (Kalki Free Tickets) ని కూడా పెట్టడం జరిగింది. అయితే అది తెలుగు రాష్ట్రాల్లో కాదు. ఓవర్సీస్ లో.. ఓవర్సీస్ లో కలెక్షన్లు తగ్గుముఖం పట్టగా, అక్కడ ప్రమోషన్ల కోసం ఏకంగా నాగ్ అశ్విన్ థియేటర్లకు వెళ్తున్నాడు. కాగా తాజాగా ఓవర్సీస్ లో ఫ్యామిలీ ప్రేక్షకులకు బై వన్ గెట్ వన్ టికెట్ ఆఫర్ ని కూడా పెట్టడం జరిగింది.

ఆ మార్క్ ని అందుకోవడానికేనా?

ఇక కల్కి సినిమా కలెక్షన్లు ఇండియాలో కూడా తగ్గుముఖం పట్టగా, ఈ వారం విడుదలైన ఇండియన్2, హిందీ లో సర్ఫిరా సినిమాల వల్ల చాలా థియేటర్లు కోల్పోవాల్సి వచ్చింది. అయితే ఈ సినిమాలకి ఆశించిన టాక్ రాకపోవడంతో చిత్ర యూనిట్ మరిన్ని ప్రమోషన్లు చేసి ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించే ప్రయత్నాలు చేస్తుంది. ఇక ఇండియాలో కూడా రేపో మాపో బై వన్ గెట్ వన్ టికెట్ ఆఫర్ ని పెడుతున్నట్టు టాక్. ఇక విడుదలైన 16 రోజుల్లో కల్కి వరల్డ్ వైడ్ గా 910 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, ఈ సినిమా ఎలాగైనా 1000 కోట్ల మార్క్ ని దాటాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. మరి చిత్ర యూనిట్ ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు