Cannes 2024 : కేన్స్ వేదికపై కాపీ గోల… ఆ స్టార్ హీరోయిన్ దీపికా స్టైల్ ను కాపీ కొట్టిందా?

Cannes 2024 : అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ కేన్స్ 2024లో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. ఓ స్టార్ హీరోయిన్ వేసుకున్న డ్రెస్ ను చూసి ఆమె దీపికా పడదుకొనే స్టైల్ ను కాపీ కొట్టింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ హీరోయిన్ కూడా బాలీవుడ్ భామనే కావడం గమనార్హం.

దీపికా పదుకొనే స్టైల్ ను కాపీ కొట్టిందా?

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024 ఘనంగా జరుగుతోంది. చాలా మంది హీరోయిన్లు రెడ్ కార్పెట్ పై నడుస్తూ కొత్త కొత్త ఫ్యాషన్ ను పరిచయం చేస్తున్నారు. కియారా అద్వానీ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొంటుందని ఇటీవల వార్తలు వచ్చాయి. ఆమె కంటే ముందు ఊర్వశి రౌతేలా కేన్స్ రెడ్ కార్పెట్ మీద కనిపించింది. బీ టౌన్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా కూడా ఈ అంతర్జాతీయ వేదిక ఏర్పాటు చేసిన రెడ్ కార్పెట్ పై హొయలు పోతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఊర్వశి లుక్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. కానీ ఆమెను చూడగానే దీపికా పదుకొణె గుర్తొస్తుంది.

హీరోయిన్ పై ట్రోలింగ్..

గతంలో ఓసారి దీపికా పదుకొనే కూడా అచ్చం ఇలాంటి డ్రెస్ లోనే కన్పించింది. స్టైల్ మాత్రమే కాదు కలర్ కూడా ఒకటే కావడంతో అందరూ ఊర్వశి దీపికాను కాపీ కొట్టింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఊర్వశి రౌతేలా రోజ్ కలర్ హై థాయ్ స్లిట్ గౌను ధరించింది. రోజ్ కలర్ డ్రెస్ లో బార్బీ డాల్ లా క్యూట్ గా ఉంది. ఊర్వశి అందమైన మేకప్‌తో అందంగా కన్పించింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2018లో దీపికా పదుకొణె ఇలాంటి పింక్ గౌను ధరించింది. ఇద్దరి లుక్స్ ను పోలుస్తూ ఇలాంటి అంతర్జాతీయ వేదికపై కాపీ కొట్టడం అంటే మన పరువు మనమే తీసుకున్నట్టుగా ఉంటుందని, ఇంత కేర్ లెస్ గా ఉంటే ఎలా అంటూ మండిపడుతున్నారు. ప్రస్తుతం దీపికా, ఊర్వశి లుక్ కు సంబంధించిన ఫోటో వైరల్‌గా మారింది.

- Advertisement -

ఊర్వశి హిందీ సినిమాలు

హిందీ సినిమా ద్వారా ఊర్వశి రౌతేలా విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. ‘సనమ్ రే’, ‘గ్రేట్ గ్రాండ్ మస్తీ’, ‘హేట్ స్టోరీ 4’ వంటి రొమాంటిక్ కామెడీ హిందీ సినిమాల్లో నటించింది ఈ హీరోయిన్. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో ఐటెం సాంగ్స్ లో డ్యాన్స్ చేస్తూ సందడి చేస్తున్నాడు. అంతేకాకుండా సోషల్ మీడియాలో బోల్డ్ ఫోటోల ద్వారా మెరుస్తోంది. ఇక ఊర్వశి రౌతేలా ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో వార్తల్లో నిలుస్తుంటారు.

ఊర్వశి తెలుగు సినిమాలు

ఊర్వశి రౌతేలా ప్రస్తుతం తెలుగులో బాలయ్య సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. అంతేకాదు ఆ మధ్య చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో ఓ ఐటెం సాంగ్ లో ఆడి పాడింది. బాసు వేర్ ఈజ్ ద పార్టీ అంటూ స్పెషల్ సాంగ్ తో టాలీవుడ్ మూవీ లవర్స్ కు ఊర్వశి దగ్గరైంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు