Case on Manjummal Boys : మంజుమ్మల్ బాయ్స్ 40 కోట్ల ఫ్రాడ్… నిజమే అని తేల్చేసిన కోర్ట్

Manjummal Boys.. మలయాళం లో చిన్న సినిమాగా వచ్చి కలెక్షన్లలో రికార్డులు సృష్టించిన మంజుమ్మెల్ బాయ్స్ మూవీ కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా నిర్మాతల బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయాలని కోరుతూ ఆదేశాలు జారీ చేసింది.. అసలు విషయంలోకెళితే కేరళ ఆరూర్ కి చెందిన సిరాజ్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పై ఎర్నాకులం సబ్ కోర్టు ఈ తీర్పునిచ్చినట్లు తెలుస్తోంది .. తాను సినిమా కోసం 7 కోట్ల రూపాయలు ఖర్చు చేసినా.. డివిడెండ్ , పెట్టుబడి కూడా ఇవ్వలేదని సిరాజ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు . సబ్ కోర్టు జడ్జి సునీల్ వర్కి.. ఈ స్పీమా నిర్మాణ సంస్థ పరవ ఫిలిమ్స్ మరియు దాని భాగస్వామి షాన్ ఆంటోని రూ.40 కోట్ల విలువైన బ్యాంకు ఖాతాను స్తంభింప చేశారు.

రూ.40 కోట్ల మోసానికి పాల్పడ్డ మంజుమ్మెల్ బాయ్స్ నిర్మాతలు..

Case on Manjummal Boys : Manjummal Boys 40 Crore Fraud...Court has decided that it is true
Case on Manjummal Boys : Manjummal Boys 40 Crore Fraud…Court has decided that it is true

సిరాజ్ వలియతార హమీద్ దాఖలు చేసిన పిటిషన్ లో సినిమా నిర్మాణానికి రూ.7 కోట్లు ఖర్చు చేయగా.. నిర్మాతలు 40 శాతం లాభాలలో వాటా ఇస్తామని వాగ్దానం చేసి.. డబ్బులు తీసుకున్నారని.. ఆపై లాభం ఇవ్వకపోగా పెట్టుబడి కూడా చెల్లించకుండా మోసం చేశారని పిటిషన్ లో పేర్కొన్నారు.. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.220 కోట్లు, ఓటిటి ప్లాట్ఫారం ద్వారా దాదాపు రూ .20 కోట్లు వసూలు చేసింది.. సినిమా నిర్మాతలు సౌబిన్ షాహిర్, బాబు షాహిర్లకు కోర్టు నోటీసులు పంపింది.. ఇక అంతే కాదు ఈ విషయంపై పోలీసులు ఆరా తీయగా.. మంజుమ్మెల్ బాయ్స్ సినిమా నిర్మాతలు ఈ సినిమా కోసం 7 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టిన సిరాజ్ కి రూ .40 కోట్ల రూపాయలు ఇవ్వకుండా మోసం చేశారని పోలీసుల విచారణలో వెల్లడయ్యింది..

పోలీసుల విచారణలో ఏం తేలిందంటే..

ఇక సినిమా భారీ హిట్ అయిన తర్వాత కూడా ఫిర్యాదుదారుడికి ఏమి చెల్లించకపోవడం గమనార్హం. మొత్తానికైతే ఈ సినిమా నిర్మాతలు అతడిని మోసం చేశారు అంటూ పోలీసుల విచారణలో తేలగా.. కోర్టు కూడా ఈ విషయం నిజమే అంటూ తేల్చేసింది.

- Advertisement -

మంజుమ్మెల్ బాయ్స్..

మలయాళ సినీ చరిత్రలో రూ .200 కోట్ల క్లబ్లో చేరిన తొలి చిత్రంగా మంజుమ్మేల్ బాయ్స్ నిలిచింది.. ఫిబ్రవరి 22న థియేటర్లలోకి వచ్చి తమిళ డబ్బింగ్ లేకుండా తమిళనాడులో రూ.50 కోట్లు దాటిన తొలి పరభాష చిత్రం కూడా ఇదే.. చిదంబరం దర్శకత్వం వహించిన ఈ మల్టీస్టారర్ సినిమాకి మలయాళ పరిశ్రమ నుంచి కాక ఇతర భాషల నుంచి కూడా విశేష స్పందన లభించింది.. ఈ చిత్రాన్ని బాబు షాహిర్ , సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోనీ పరవా ఫిలిం మరియు శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై రిలీజ్ చేశారు.. ఇక ఇందులో సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసి, బాలు వర్గీస్ , గణపతి, లాల్ జూనియర్, అభిరాం రాధాకృష్ణన్, దీపక్ పరంబోల్, విష్ణు రఘు, ఖలీల్ రెహమాన్, అరుణ్ కురియన్ తదితరులు నటించారు ఇక ఈ సినిమా షూటింగ్ మొత్తం కేరళ తమిళనాడులోని జరిగింది. ఇక ఇప్పుడు నిర్మాతల విషయంలో మళ్ళీ వార్తల్లో నిలిచింది ఈ సినిమా.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు