Pawan Kalyan – SriReddy : పవన్ కళ్యాణ్‌పై అసభ్యకర కామెంట్స్… శ్రీరెడ్డిపై కేసు నమోదు

Pawan Kalyan – SriReddy : శ్రీరెడ్డి.. ఈ పేరు తెలియని వాళ్లు ఉండరు.. ఈమె లేపిన క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమం తో అప్పట్లో ఇండస్ట్రీ మొత్తం షేక్ అయ్యింది.. అర్ధ నగ్నంగా ఫిలిం చాంబర్ ముందు చేసిన ధర్నా తో ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీ ఉలిక్కి పడింది.. ఇండస్ట్రీలో అమ్మాయిలకు అన్యాయం జరుగుతుందని లేవనెత్తిన ఉద్యమం, ఇప్పుడు మీటూ గా మారింది.. ఎంతోమంది హీరోయిన్లు తాము కూడా అలాంటి బాధలు అనుభవించామని ముందుకు వచ్చారు.. అయితే శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్ కు వ్యతిరేకంగా పోరాటం చెయ్యడం తో పాటుగా మెగా హీరో పవన్ కళ్యాణ్ ను గెలికింది.. అతను ఫ్యాన్స్ దెబ్బకు ఆమె ఏకంగా స్టేట్ ను మార్చింది..

ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న శ్రీరెడ్డి ఇప్పటికి తెలుగు హీరోలను వదల్లేదు.. ఇక తమిళ హీరోలపై కూడా ఆరోపణలు చేసింది.. అటు రాజకీయా లపై చురుగ్గా ఉంటున్న ఈ బ్యూటీ వైసీపీకి సపోర్ట్ చేస్తూ టీడీపీ, కూటమి పై తీవ్ర ఆరోపణలు చేసింది.. సోషల్ మీడియాను వేదికగా చేసుకొని తన మనసులోని మాటలను బయటపెడుతూ నెట్టింట నిత్యం ట్రెండ్ అవుతుంది.. అయితే తాజాగా శ్రీరెడ్డి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసింది.. ఆమె చేసిన అసభ్య కామెంట్స్ పై కొందరు ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు..

తమ అభిమాన హీరో పై అసభ్య కామెంట్స్ చెయ్యడం పై తట్టుకోలేక పోతున్నామని ఆమె పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఆంధ్రప్రదేశ్ కర్నూల్ జిల్లాలో 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో పవన్ కళ్యాణ్ అభిమానులు శ్రీరెడ్డి పై కేసు పెట్టారు.. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెకు విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపినట్లు తెలుస్తుంది.. మరి దీనిపై శ్రీరెడ్డి ఎలా స్పందిస్తుందో చూడాలి.. శ్రీరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేస్తారా ? లేక విచారిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.. ఏది ఏమైనా ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు