Cbn : ఏంటి బాబు గారు ఇది.? అశ్వని దత్ కి ఒక రూల్ , కమల్ హాసన్ కి ఒక రూల్

Cbn : ప్రస్తుతం సౌత్ ఫిలిం ఇండస్ట్రీ అంతా వెయిట్ చేస్తున్న సినిమా ఇండియన్ 2. దాదాపు నాలుగు సంవత్సరాలు క్రితం మొదలైన ఈ సినిమా ఇప్పటికి రిలీజ్ కి సిద్ధం అవుతుంది ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఎన్నో అవాంతరాలు వచ్చాయి. ఈ సినిమా షూటింగ్ లో అగ్ని ప్రమాదం జరగటం. అలానే చాలామంది గాయపడటం. ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు చనిపోవడం కూడా జరిగింది. ఇప్పుడు రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే రామ్ చరణ్ తేజ్ తో గేమ్ చేంజర్ అనే సినిమాను కూడా అనౌన్స్ చేసి షూటింగ్ పూర్తి చేశాడు.

శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ శంకర్ తీసుకున్న కాన్సెప్ట్ ఇవన్నీ కూడా అప్పట్లో జనాల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా అప్పట్లో ఒక పెను సంచలనం అని చెప్పొచ్చు. ఇప్పుడు కూడా ఈ సినిమా చూస్తున్నప్పుడు అదే ఫీల్ కలుగుతుంది. ఒక ఎట్టకేలకు ఈ సినిమాకి సీక్వెల్ పూర్తయి రేపు థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు సినిమా పరిశ్రమ ఎటువంటి సమస్యలు ఫేస్ చేసింది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారీ బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కించిన కూడా సరైన టిక్కెట్ ధరలు ఉండేవి కాదు. కేవలం ఒక పవన్ కళ్యాణ్ వలన కంప్లీట్ గా సినిమా ఫిలిం ఇండస్ట్రీని టార్గెట్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మెగాస్టార్ చిరంజీవి చాలామంది స్టార్ హీరోలను అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకువెళ్లి అడిగిన తర్వాత టిక్కెట్ రేట్లు కొద్దిపాటి మార్పును ఇచ్చారు.

- Advertisement -

Kalki 2898 AD

రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఒక కీలక పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీ గురించి కూడా మేలు చేయాలని ఉద్దేశంతో ఉన్నారు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన కల్కి సినిమా విషయంలో కూడా టికెట్ రేట్ల విషయంలో మంచి సపోర్ట్ ఇచ్చారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇండియన్ 2 సినిమాకి సంబంధించి టికెట్ రేట్లను పెంచుకోవడానికి అవకాశం ఇవ్వలేదు అని వార్తలు వస్తున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో చాలామంది స్పందిస్తూ వస్తున్నారు. నిర్మాత అశ్విని దత్ కు టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చి కమల్ హాసన్ కు ఇవ్వకపోవడంతో ఏంటి బాబు ఇది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు