Mega Family : అన్నయ్యకు తమ్ముడి పాదాభివందనం.. ఈ దృశ్యం చూసి చెమర్చని కళ్ళు ఉంటాయా..!

Mega Family : మెగాస్టార్ చిరంజీవి కళ్ళలో ఆనందం చాలా రోజులకు వెళ్లి విరిసింది. మెగాభిమానులకు ఈరోజు ఒక కన్నుల పండుగలా మంచి ట్రీట్ దొరికిందని చెప్పాలి. నిజం చెప్పాలంటే మెగా ఫ్యామిలీ లో క్లింకార పుట్టిన తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకు మెగా ఫ్యామిలీ లో సంతోషాలు వెల్లివిరిసాయి. దానికి కారణం పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి. కానీ మెగాభిమానులు ఈరోజు ఇంత సంతోషపడడానికి కారణం కాసేపటికిందే వచ్చిన ఓ స్పెషల్ వీడియో అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాజాగా పిఠాపురం నుండి పోటీ చేసి అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాను గెలవడమే కాకుండా జనసేన నుండి పోటీ చేసిన 21 మంది ఎమ్మెల్యేల్ని కూడా గెలిపించి వంద శాతం గ్రాండ్ విక్టరీని సాధించారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి ఆశీర్వాదం తీసుకోవడానికి ఇంటికి తరలివెళ్లారు. అక్కడ పవన్ కళ్యాణ్ కి ఊహించనంత గ్రాండ్ వెల్ కమ్ లభించిందని చెప్పాలి.

Celebrations in Mega Family. Pawan Kalyan took Chiranjeevi's blessings

అన్నయ్య కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకుని పవన్ కంటతడి..

ఇక పవన్ కళ్యాణ్ కి మెగా ఫ్యామిలీ (Mega Family) నుండి ఊహించని రేంజ్ లో గ్రాండ్ వెల్ కమ్ దక్కిందని చెప్పాలి. అక్కడ మెగాస్టార్ చిరంజీవి మొదలు కొని ఫ్యామిలీ లోని అందరు కుటుంబ సభ్యులు ఉండడం విశేషం. చాలా రోజుల తర్వాత ఇలా ఫ్యామిలీ మొత్తం ఒకేసారి, ఒకే వీడియో ఫ్రేమ్ లో కనిపించడం విశేషం. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిని కలవగానే ముందుగా పవన్ కళ్యాణ్ వెళ్లి ఆయన కాళ్ళ మీద పడిపోయి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత ఈ దృశ్యాన్ని చూసి నాగబాబు తో సహా అక్కడున్న వాళ్ళందరి కళ్ళు చెమర్చాయి. అక్కడి వాళ్లే కాదు, ఈ సీన్ చూసిన మెగాఅభిమానులు కూడా ఆనంద భాష్పాలతో కళ్ళు చెమర్చారు. ఇక ఆ తర్వాత చిరంజీవి గులాబీ గజమాలతో పవన్ కళ్యాణ్ ను ఘనంగా సత్కరించారు. ఆ వెంటనే రామ్ చరణ్ సైతం వచ్చి పవన్ కళ్యాణ్ ని హగ్ చేసుకుని ఆశీర్వాదం తీసుకున్నారు.

- Advertisement -

మెగా ఫ్యామిలీ ఇంట సంబరం..

ఇక మెగా (Mega Family) కుటుంబ సభ్యులందరూ ఏర్పాటుచేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్, రామ్ చరణ్ భార్య ఉపాసన అలాగే మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ, తమ్ముడు నాగబాబు, మనవరాళ్ళు, మనవళ్లు, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, అలాగే సాయి ధరమ్ తేజ్ కూడా ఉన్నారు. ఇక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే పవన్ వెంట తన భార్య అన్నా లెజినోవాతో పాటు కుమారుడు అఖీరా నందన్ కూడా ఉన్నారు. ఇక ఈ వీడియో రిలీజ్ చేసిన వెంటనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి కళ్ళల్లో నిజమైన ఆనందం చాన్నాళ్ల తర్వాత మళ్ళీ కనిపించిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ మరో రెండు రోజుల్లో ఎమ్మెల్యే గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు