Tollywood Celebrities : టాలీవుడ్ లో రెండు పెళ్లిళ్లు చేసుకున్న సెలెబ్రేటీలు..

Tollywood Celebrities : సినిమా ఇండస్ట్రీలోని సెలెబ్రేటీలు ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవడం కామన్.. ఇక ఎంత త్వరగా పెళ్లిళ్లు చేసుకుంటారో అంత త్వరగా విడాకులు కూడా తీసుకుంటున్నారు. ఇక ఒంటరిగా ఉండటం ఎందుకని మళ్లీ తమకు నచ్చిన వారిని ప్రేమించి రెండో పెళ్లి చేసుకుంటున్నారు. అసలు తెలుగులో స్టార్ హీరోలు అయితే మూడు పెళ్లిళ్లు కూడా చేసుకున్న వాళ్లు ఉన్నారు. టాలీవుడ్ లో కొంతమంది హీరోలు రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. అలా రెండు పెళ్ళిళ్ళు అంతకు మించి చేసుకున్న ఆ హీరోలు ఎవరో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఎన్టీఆర్..

Celebrities who got married twice in Tollywood..
Celebrities who got married twice in Tollywood..

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ పేరు సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. అలాంటి ఆయన 20 ఏళ్ల వయసులో మేనమామ కుమార్తె బసవతారకంను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 11 మంది సంతానం. 1985లో బసవతారకం అనారోగ్యం కారణంగా మరణించారు.. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాక లక్ష్మీ పార్వతిని రెండో పెళ్లి చేసుకున్నాడు.

కృష్ణం రాజు..

Celebrities who got married twice in Tollywood..
Celebrities who got married twice in Tollywood..

రెబల్ స్టార్ కృష్ణం రాజు గురించి, ఆయన సినిమా గురించి అందరికీ తెలిసిందే. మొదట సీతాదేవిని వివాహం చేసుకున్నారు. ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత ఆయన ఏపీలోని తునికి చెందిన శ్యామల దేవిని రెండో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ప్రస్తుతం కృష్ణంరాజు భౌతికంగా లేరు..

- Advertisement -

నాగార్జున..

Celebrities who got married twice in Tollywood..
Celebrities who got married twice in Tollywood..

అక్కినేని ఫ్యామిలీలో రెండు పెళ్లిళ్లు కామన్.. దగ్గుబాటి రామానాయుడు ఏకైక‌ కుమార్తె దగ్గుబాటి లక్ష్మిని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత అమలను ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్యకు నాగ చైతన్య పుట్టాడు. రెండో భార్యకు అఖిల్ పుట్టాడు. వీరిద్దరి ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నాడు.

కమల్ హాసన్..

Celebrities who got married twice in Tollywood..
Celebrities who got married twice in Tollywood..

కమలహాసన్ ఇద్దరిని పెళ్లాడడంతో పాటు మరొకరితో సహజీవనం కూడా చేశారు. ముందు కమలహాసన్ వాణిగణపతిని వివాహం చేసుకున్నారు. ఆమెకు విడాకులు ఇచ్చి తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సారికను రెండో పెళ్లి చేసుకున్నారు. ఈమెకు ఇద్దరు కూతుర్లు. ఆ తర్వాత గౌతమిని ప్రేమించాడు. కొద్ది రోజులు కలిసి ఉన్న వీరిద్దరూ ఇప్పుడు దూరంగా ఉన్నారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

Celebrities who got married twice in Tollywood..
Celebrities who got married twice in Tollywood..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటిగా వైజాగ్‌కు చెందిన నందినిని వివాహం చేసుకున్నారు. ఇది పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రాకముందే జరిగిన పెళ్లి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ 2005లో రేణు దేశాయ్‌ని వివాహం చేసుకున్నారు. అది కూడా మనస్పర్థలు రావడంతో విడిపోయారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అన్నా లేజీనోవా అనే హీరోయిన్ ను పెళ్లి చేసుకున్నారు. మొత్తంగా చూసుకుంటే మూడు పెళ్లిళ్లు అని తెలుస్తుంది. తన మూడో భార్యతో కలిసి ఉన్నాడు. అంతేకాదు మొన్న జరిగిన ఎన్నికల్లో గెలిచి ఏపీ డిప్యూటీ సీఏం గా బాధ్యతలు చేపట్టాడు.

ప్రకాష్ రాజ్..

Celebrities who got married twice in Tollywood..
Celebrities who got married twice in Tollywood..

విల‌క్షణ న‌టుడు ప్రకాష్ రాజ్‌ మొదట లలిత కుమారుని వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం కాగా తర్వాత వీళ్ళిద్దరూ విడిపోయారు.. ఇప్పుడు బాలీవుడ్ డ్యాన్సర్ ను పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం మూడో పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. వీళ్లే కాదు ఇప్పుడు ఆ లిస్ట్ లోకి నాగ చైతన్య కూడా చేరిపోయాడు. వీరంత రెండు, అంతకన్నా ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న వారే. హీరోలే కాదు, హీరోయిన్లు కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్న వారు ఉన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు