Celebrity Brand Valuation 2023 : ఇప్పుడు అలియా ముందు దీపికా జుజుబీ

Celebrity Brand Valuation 2023 : ప్రస్తుతం సినిమా ఇండిస్ట్రీలో ఉన్న సెలబ్రిటీలు కేవలం సినిమాలు మాత్రమే చేయట్లేదు. తమ ఇమేజ్ కు తగ్గట్టుగా పలు బ్రాండ్స్ కు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తూ కోట్లలో సంపాదిస్తున్నారు. తాజాగా సెలబ్రిటీల బ్రాండ్ వాల్యూ ఎంత అనే రిపోర్ట్ బయటకొచ్చింది. 2023 కు సంబంధించిన ఆ రిపోర్ట్ లో ఈసారి అలియా భట్ దీపికాను వెనక్కి నెట్టింటి. మరి ఈ లిస్ట్ ఎవరు ఏ స్థానంలో ఉన్నారు? వారి బ్రాండ్ వాల్యూ ఎంత ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

మొదటి స్థానంలో క్రికెటర్

సెలబ్రిటీల బ్రాండ్ వాల్యూ రిపోర్ట్ 2023 తాజాగా బయటకు వచ్చింది. దేశంలోని అత్యంత విలువైన సెలబ్రిటీలలో విరాట్ కోహ్లి పేరు మొదటి స్థానంలో ఉంది. 2023 సంవత్సరంలో అతని బ్రాండ్ విలువ 227.9 మిలియన్లు. 2020లో కోహ్లీ బ్రాండ్ విలువ 23.77 కోట్ల డాలర్లు. కన్సల్టెన్సీ సంస్థ క్రోల్ సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ రిపోర్ట్ 2023 ప్రకారం విరాట్ కోహ్లీ రణవీర్ సింగ్‌ను ఓడించి అగ్రస్థానంలో నిలిచాడు.

గత ఏడాది రణవీర్ సింగ్ ఈ లిస్ట్ లో మొదటి స్థానంలో ఉన్నారు. కానీ ఈ ఏడాది ఆయన బ్రాండ్ విలువ కాస్త తగ్గడంతో రెండవ స్థానంలో నిలిచారు. 2023 సంవత్సరంలో ఆయన బ్రాండ్ విలువ 203.1 మిలియన్ డాలర్లుగా ఉంది. ‘జవాన్’, ‘పఠాన్’ ద్వారా మరోసారి బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ మూడవ స్థానంలో ఉన్నాడు. అతని బ్రాండ్ విలువ 120.7 మిలియన్లు. ఈ జాబితాలో అక్షయ్ కుమార్ ఇప్పుడు నాలుగో స్థానంలో నిలిచాడు. అక్షయ్ బ్రాండ్ విలువ 11.17 మిలియన్లు.

- Advertisement -

Virat Kohli tops most valuable celebrity brand list featuring SRK, Ranveer Singh, Alia Bhatt

అలియా ముందు దీపికా జుజుబీ

క్రోల్ సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ రిపోర్ట్ 2023 ప్రకారం ఈ జాబితాలో అలియా భట్ పేరు ఐదవ స్థానంలో ఉంది. ఆమె బ్రాండ్ విలువ 10.11 మిలియన్ డాలర్లు. అయితే ఆమె బ్రాండ్ వాల్యూ దీపికా పడుకొనే కంటే ఎక్కువగా ఉండడం విశేషం. ఈ లిస్ట్ లో ఊహించని విధంగా దీపిక ఆరో స్థానంలో నిలిచింది. ఆమె బ్రాండ్ వాల్యూ 2023లో 9.6 మిలియన్లు మాత్రమే ఉంది.

క్రికెటర్లు కూడా..

ఈ జాబితాలో ఎంఎస్ ధోని ఏడో స్థానంలో ఉన్నాడు. ధోనీ బ్రాండ్ విలువ 9.58 మిలియన్ డాలర్లు. కాగా సచిన్ టెండూల్కర్ 9.13 మిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాడు. అమితాబ్ 83.6 మిలియన్ డాలర్ల బ్రాండ్ వాల్యూతో తొమ్మిదవ స్థానంలో ఉండగా, బాలీవుడ్ దబాంగ్ సల్మాన్ ఖాన్ పేరు 81.7 మిలియన్ డాలర్ల బ్రాండ్ వాల్యూతో ఏకంగా పదవ స్థానంలో ఉండడం గమనార్హం.

కంప్లీట్ సెలబ్రిటీ బ్రాండ్ ర్యాంకింగ్ లిస్ట్

  1. విరాట్ కోహ్లీ
  2. రణవీర్ సింగ్
  3. షారుఖ్ ఖాన్
  4. అక్షయ్ కుమార్
  5. అలియా భట్
  6. దీపికా పదుకొణె
  7. ఎంఎస్ ధోని
  8. సచిన్ టెండూల్కర్
  9. అమితాబ్ బచ్చన్
  10. సల్మాన్ ఖాన్
  11. హృతిక్ రోషన్
  12. కియారా అద్వానీ
  13. రణబీర్ కపూర్
  14. అనుష్క శర్మ
  15. కరీనా కపూర్ ఖాన్
  16. ఆయుష్మాన్ ఖురానా
  17. కార్తీక్ ఆర్యన్
  18. రోహిత్ శర్మ
  19. హార్దిక్ పాండ్యా
  20. రష్మిక మందన్న
  21. నీరజ్ చోప్రా
  22. అల్లు అర్జున్
  23. సారా అలీ ఖాన్
  24. వరుణ్ ధావన్
  25. కత్రినా కైఫ్

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు