Celebrity Divorce : నెట్టింట దుమారం రేపిన 5గురు స్టార్ కపుల్స్ డివోర్స్

Celebrity Divorce : ఇటీవల కాలంలో ఎక్కువగా సెలబ్రిటీల రిలేషన్స్, పెళ్లి గురించిన వార్తలు ముఖ్యాంశాలుగా మారుతున్నాయి. గత కొంతకాలం నుంచి ఎంతో అన్యోన్యంగా ఉన్నారని అన్పించే కొంతమంది సౌత్  స్టార్ కపుల్స్ ఊహించని విధంగా డివోర్స్ తీసుకుని షాక్ ఇచ్చారు. సౌత్ లో విడాకులు తీసుకుని షాక్ ఇచ్చిన టాప్ 5 ప్రముఖ జంటలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం

టాప్ 5 సౌత్ ఇండియన్ సెలెబ్స్ విడాకుల వార్తలు

1. సమంత రూత్ ప్రభు, నాగ చైతన్య

నాగ చైతన్య, సమంతా రూత్ ప్రభు టాలీవుడ్ మూవీ లవర్స్ అత్యంత ఇష్టపడే జంటలలో ఒకరు. 2010లో సమంత తొలి చిత్రం ఏ మాయ చేసావే సెట్స్‌లో కలిసిన వీరిద్దరూ ఆ తరువాత ప్రేమలో పడ్డారు. చాలా సంవత్సరాల పాటు డేటింగ్ చేసిన తర్వాత చై-సామ్ 2017లో పెళ్లి చేసుకున్నారు. కానీ 2021లో విడాకులు తీసుకుంటున్నామని చెప్పి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు.

2. జివి ప్రకాష్ కుమార్, సైంధవి

తాజాగా సంగీత దర్శకుడు, నటుడు జివి ప్రకాష్ కుమార్ కూడా విడాకుల బాట పట్టాడు. 2013లో జీవి గాయని సైంధవిని పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ చిన్ననాటి స్నేహితులు, ప్రేమికులు కూడా. 2020లో ఈ జంటకు అన్వీ అనే కూతురు కూడా పుట్టింది. కానీ ఇప్పుడు ఇద్దరి మధ్య ఏర్పడిన అభిప్రాయ బేధాల కారణంగా ఈ జంట విడాకుల బాట పట్టారు

- Advertisement -

3. ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్

వివాహమైన 18 సంవత్సరాల తర్వాత ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ విడిపోతున్నట్లు ప్రకటించారు. అధికారికంగా ఎవరూ చెప్పనప్పటికీ  విడాకులకు రాజీపడలేని విభేదాలే ప్రధాన కారణమని అర్థమైంది. 2022లో ఈ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరూ విడాకులు తీసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు మొదట్లో వార్తలు వచ్చినప్పటికీ, ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇద్దరూ అధికారికంగా చెన్నై ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారని, ఇది సెక్షన్ 13-బి ప్రకారం మ్యూచువల్ గా విడాకులు తీసుకున్నట్లు సమాచారం. ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్‌లకు యాత్రా, లింగ అనే ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.

4. అమలా పాల్, ఏఎల్ విజయ్

అమలా పాల్, ఏఎల్ విజయ్ నిస్సందేహంగా 2010లలో అత్యంత పాపులర్ అయిన జంటలలో ఒకరు. విజయ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం దైవ తిరుమగల్‌లో అమలా పాల్ హీరోయిన్ గా నటించింది. అప్పటి నుంచే వీరిద్దరూ డేటింగ్ ప్రారంభించారని అనేక పుకార్లు వచ్చాయి. అయితే ఈ రూమర్స్‌ను మొదట్లో ఇద్దరూ కొట్టిపారేశారు. కానీ 2014 జూన్‌లో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. కానీ రెండేళ్లకే అంటే 2016లో అమలా పాల్, విజయ్ లైఫ్ స్టైల్ లో తేడాల కారణంగా విడిపోయారు. విజయ్ 2019లో డా. ఆర్ ఐశ్వర్యను, 2023లో అమలా పాల్ కూడా తన ప్రియుడు, వ్యాపారవేత్త జగత్ దేశాయ్ ను వివాహం చేసుకున్నారు.

5. ప్రభుదేవా, లత

2010లో ప్రభుదేవా, అతని భార్య లత మధ్య జరిగిన విడాకుల కథ చాలామందికి తెలిసే ఉంటుంది. కొరియోగ్రాఫర్, నటుడు ప్రభుదేవా, నయనతార ప్రేమ పెళ్లి దాకా వెళ్ళింది. అయితే ప్రభుదేవాకు అప్పటికే పెళ్ళయ్యింది. ఆయన భార్య లత అప్పట్లో విడాకుల పత్రాలపై సంతకం చేయడానికి నిరాకరించడంతో వివాదం చెలరేగింది. ఆమె నయనతారతో ప్రభుదేవా పెళ్ళిని ఒప్పుకోలేదు. పైగా మరో నటితో సంబంధం కలిగి ఉన్నాడని, అతను కుటుంబాన్ని పట్టించుకోలేదని ఆరోపిస్తూ ఫ్యామిలీ కోర్టులో దావా కూడా చేసింది. వరుస వివాదాల తర్వాత ఎట్టకేలకు ప్రభుదేవా, లత విడాకులకు సిద్ధమయ్యారు. అయితే నయనతార, ప్రభుదేవా 2011లో విడిపోయారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు