Chahat Fateh Ali Khan : పాకిస్థాన్ సింగర్ కి యూట్యూబ్ షాక్… ఇండియన్స్ ను అవమానించేలా ఉన్న ఆ పాపులర్ పాట డిలీట్

Chahat Fateh Ali Khan : పాకిస్థానీ గాయకుడు చాహత్ ఫతే అలీ ఖాన్ బొంగురుపోయిన స్వరం నెటిజన్లను పిచ్చెక్కించేలా చేసింది. ఆయన పాడిన ఓ పాట ఇటీవల కాలంలో తెగ వైరల్ అయ్యింది. ఈలోగా యూట్యూబ్ అతనికి గట్టి షాక్ ఇచ్చింది. యూట్యూబ్ ఎందుకు ఈ నిర్ణయాన్ని తీసుకుందంటే?

బడో బడి పాటతో పాపులర్

చాహత్ ఫతేహీ అలీఖాన్ బడో బడి అనే పాటను ఓ యువతితో కలిసి పాడారు. ఈ పాటలో అతని కరడుగట్టిన వాయిస్ హైలైట్ అవుతుంది. దీన్ని మీమ్ గా ఓ రేంజ్ లో ఉపయోగిస్తున్నారు. ‘బడో బడి’ పాటను 2024 ఏప్రిల్‌లోనే యూట్యూబ్‌లో విడుదల చేయగా భారీ సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. ‘బడో బడి..’ పాట సోషల్ నెట్‌వర్క్‌లో ఎంతటి సంచలనం సృష్టించింది అంటే ప్రతీ 10 రీల్స్‌లో 5 రీళ్లు ఈ పాటకు సంబంధించినవే అంటే అర్థం చేసుకోవచ్చు.

పాటను డిలీట్ చేసిన యూట్యూబ్

యూట్యూబ్‌లో సంచలనం సృష్టించిన ఈ పాటను తాజాగా తొలగించారు. బాగా పాపులర్ అయినప్పటికీ చాలా మంది చహత్ ఫతేహీ అలీ ఖాన్‌ను విమర్శించారు. తన పాటకు మంచి రెస్పాన్స్ వస్తుండడంతో బ్యాక్ టు బ్యాక్ పాటలను విడుదల చేస్తూ వస్తున్నారు. ఇలాంటి సమయంలో బడొ బడి పాటను డిలీట్ చేసి ఆ పాకిస్థానీ సింగర్ కు యూట్యూబ్ షాక్ ఇచ్చింది. ఈ పాట కాపీరైట్ కారణాలతో డిలీట్ అయినట్టు సమాచారం. విశేషమేమిటంటే ఈ పాటను సరిగ్గా 128 మిలియన్ సార్లు వీక్షించారు. అంటే ఈ పాటకు 12.8 కోట్ల వ్యూస్ వచ్చాయి.

- Advertisement -

Chahat Fateh Ali Khan's viral song 'Bado Badi' deleted from YouTube - India  Today

ఈ పాటను తొలగించడానికి కారణం ఏమిటి?

నిజానికి కాపీరైట్ కారణంగా ఈ పాట తొలగించబడింది. అయితే ప్రముఖ గాయని నూర్జహాన్ తొలిసారిగా ‘బడో బడి’ పాట పాడారు. ఈ పాటను చాహత్ ఫతే అలీ ఖాన్ తనదైన శైలిలో మళ్లీ పాడుతూ అవమానించాడు. ఇది చాలా మందికి బాధ కలిగించింది.

1962లో విడుదలైన ‘బనారాసి థగ్‌’ సినిమా కోసం నూర్‌జహాన్‌ ఈ పాట పాడారు. తర్వాత యోయో హనీ సింగ్ కూడా ఈ పాటను రీమిక్స్ చేశాడు. ఆ తర్వాత చాహత్ ఫతే అలీఖాన్ ఎలాంటి హక్కులు పొందకుండానే ‘బడో బడి’ పాట పాడారు. ఇది పాకిస్థాన్‌లోనే కాకుండా భారత్, బంగ్లాదేశ్‌తో సహా మొత్తం దక్షిణాసియాలో వైరల్‌గా మారింది.

చాహత్ ఫతేహి అలీ ఖాన్ ఎవరు?

చాహత్ ఫతేహి అలీ ఖాన్ ఒక పాకిస్థానీ గాయకుడు. చాహత్ తన కెరీర్‌ను క్రికెటర్‌గా ప్రారంభించాడు. అతను పాకిస్థాన్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. 1983-84లో ఖువైద్-ఇ-అజం ట్రోఫీలో చాహత్ రెండు మ్యాచ్‌ల్లో 16 పరుగులు చేశాడు. తర్వాత చాహత్ ఫతేహి ఇంగ్లండ్ వెళ్లి 12 ఏళ్ల పాటు క్లబ్ క్రికెట్ ఆడాడు. అతను కోవిడ్ సమయంలో సోషల్ మీడియాలో పాటలను రికార్డ్ చేయడం, పోస్ట్ చేయడం ప్రారంభించాడు. ఆ తర్వాత అతికొద్దికాలంలోనే ఇలా సింగర్ గా సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు