Chaitanya Reddy: ముందు గవర్నమెంట్ వలన మేము చాలా నష్టపోయాము, మాపైన రాజకీయ ఒత్తిడి తీసుకొచ్చి పెట్టారు

Chaitanya Reddy:తెలుగు సినిమా పరిశ్రమ కి రాజకీయ నాయకులకి ఒకప్పుడు మంచి సత్సంబంధాలు ఉండేవి. వాటిని చాలామంది అలానే మైంటైన్ చేసుకొని వచ్చారు. రాజకీయాలు సినిమా పరిశ్రమ వేరువేరు అని చెప్పలేం ఎందుకంటే ఎంతోమంది సినిమా ప్రముఖులు రిటైర్ అయిన తర్వాత రాజకీయ నాయకులుగా పనిచేశారు. కొంతమంది సినిమాల్లో బిజీగా ఉంటూనే రాజకీయాల్లో కూడా తన సత్తాను చూపించారు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం వైఎస్ఆర్సిపి సినిమా పరిశ్రమకు మధ్య చాలా వివాదాలు నెలకొన్నాయి వీటన్నిటికీ కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

2014లో పవన్ కళ్యాణ్ జనసేన అనే పార్టీని స్థాపించి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశారు. ఆ తర్వాత 2019లో తమ పార్టీ తరఫున సొంతంగా నిలబడ్డారు అయితే పవన్ కళ్యాణ్ నిలబడిన చోట ఓటమి చవిచూశారు. లేకపోతే 2019లో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే కేవలం పవన్ కళ్యాణ్ మీద ఉన్న వ్యతిరేకం వలన కంప్లీట్ గా సినిమా పరిశ్రమ మీద టార్గెట్ చేయడం మొదలుపెట్టింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం. ఉన్నపలంగా సినిమా టికెట్ రేట్లను కూడా తగ్గించేశారు. ఆ టైంలో నాని వంటి హీరో కూడా ఓపెన్ గా మాట్లాడాడు. దానివలన నాని సినిమాలు కూడా చాలా ఎఫెక్ట్ అయ్యాయి.

లేకపోతే మెగాస్టార్ చిరంజీవి సినిమా టిక్కెట్ రేట్లు పెంచడానికి తన వంతు ప్రయత్నం చేశారు. చాలామంది స్టార్ హీరోలు సైతం చిరంజీవి తన వెంటబెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని కలిసి ప్రాధేయపడ్డారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించిన తీరు చాలా మందికి ఆగ్రహాన్ని కలిగించింది. ఎట్టకేలకు ఆ సినిమాలకు సంబంధించి టికెట్ రేట్లను పెంచడం జరిగింది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లు తక్కువగా ఉండటం వలన రెండు సినిమాలు హిట్ అయినా కూడా చాలా నష్టం చవిచూసాము అని హనుమాన్ సినిమా ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -

Bheemla Nayak

ముందు గవర్నమెంట్ లో లో మేము బాగా నష్టపోయాము, ఆంధ్రప్రదేశ్ లో పుష్ప భీమ్లా నాయక్ సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశాము. వాటికి వచ్చిన ఆక్యుపెన్సి కి రేట్లు ఉండుంటే మంచి నెంబర్స్ , ప్రాఫిట్స్ చూసేవాళ్ళం కానీ టికెట్ రేట్లు చాలా తక్కువ ఉన్నాయి. భీమ్లా నాయక్ సినిమాకి కి పొలిటికల్ ప్రజర్స్ గట్టిగా ఉన్నాయి. అంటూ తన మాటలో చెప్పుకొచ్చారు చైతన్య రెడ్డి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు