Chakram Re-Release : మళ్లీ రాబోతున్న ప్రభాస్ సెంటిమెంటల్ మూవీ… ఎప్పుడంటే…?

Chakram Re-Release: టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కృష్ణంరాజు వారసత్వాన్ని అందిపుచ్చుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు ప్రభాస్. రాఘవేంద్ర అలాగే ఈశ్వర్ లాంటి సినిమాలు చేసిన ప్రభాస్ ఆ తర్వాత చత్రపతి సినిమాతో బంపర్ హిట్ అందుకున్నాడు.

బాహుబలి సినిమాతో… పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగిన ప్రభాస్… ఇప్పుడు అన్ని పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నారు. ఇండియా వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ క్రేజ్ ఎక్కడికో వెళ్ళింది. ఇది ఇలా ఉండగా ప్రభాస్ సెంటిమెంట్ మూవీ… రీ రిలీజ్ కాబోతుంది. ఆ సినిమానే చక్రం. చక్రం సినిమా గురించి తెలియని వారు ఉండరు.

chakram

2005 సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. కానీ టీవీలో రిలీజ్ అయిన తర్వాత… చక్రం సినిమాకు మంచి ఆదరణ లభించింది అని చెప్పవచ్చు. కృష్ణవంశీ చేసిన ఈ చక్రం సినిమా త్వరలోనే రీ రిలీజ్ కాబోతుంది. జూన్ 8వ తేదీన థియేటర్లలో ఈ సినిమా రిలీస్ కాబోతుంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా చూసి ఎందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

కాగా ప్రభాస్ హీరోగా చేసిన ఈ చక్రం సినిమాలో… ఆసిన్ మె యిన్ హీరోయిన్ గా నటించింది. అలాగే చార్మి సైడ్ హీరోయిన్గా నటించి అందరిని మెప్పించింది. దర్శకత్వం వహించిన ఈ సినిమాను వెంకట్ రాజు అలాగే శివరాజు నిర్మించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు